చరణ్-కియారాకి ఎందుకిలా జరుగుతోంది!
రామ్ చరణ్- కియారా అద్వాణీ కాంబినేషన్ ఎందుకనో వర్కౌట్ అవ్వడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన `గేమ్ ఛేంజర్` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jan 2025 4:46 AM GMTరామ్ చరణ్- కియారా అద్వాణీ కాంబినేషన్ ఎందుకనో వర్కౌట్ అవ్వడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన `గేమ్ ఛేంజర్` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితం ఊహించని విధంగా వచ్చింది. అంతకు ముందు చరణ్-కియారా `వినయ విధేయ రామ`లోనూ కలిసి నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితం తేడా కొట్టేసింది.
అలా చరణ్-కియారా కలిసి నటించిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్లగానే నమోదయ్యాయి. దీంతో ఇద్దరి కాంబినేషన్ ని ఇకపై రిపీట్ చేయకపోవడమే మంచిదనే విమర్శ వ్యక్తమవుతోంది. వాస్తవానికి శంకర్ `గేమ్ ఛేంజర్` కి ఎంపిక చేసినప్పుడే ఇదోక బ్యాడ్ ఇండికేషన్ గా నెట్టింట వైరల్ అయింది. `వినయ విధేయ రామ`తో ప్లాప్ కాంబినేషన్ అనే ముద్ర పడింది. అయినా శంకర్ పట్టుబట్టి మరీ కియారాని ఎంపిక చేసాడు.
దీంతో మెగా అభిమానుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైంది. అయినా శంకర్ వాటన్నింటి లైట్ తీసుకుని ముందు కెళ్లారు. కట్ చేస్తే ఫలితం తారు మారైంది. ఇక ప్లాప్ కి కర్ణుడి చావు తరహా కారణాలెన్నో తెరపైకి వస్తున్నాయి. అయినా ఇదంతా గతం. గతాన్ని తవ్వినా ఎలాంటి ఫలితం ఉండదు. కానీ అనుభవం నుంచి ఏం నేర్చుకున్నాం అన్నది ముఖ్యమైంది. మరి ఈ ప్లాప్ శంకర్ లో ఎలాంటి పరివర్తన తీసుకొస్తుందో చూడాలి.
కియారా టాలీవుడ్ లో `భరత్ అనే నేను` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అందులో సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో కియారా చాలా బలమైన పాత్ర పోషించింది. తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న రోల్ దక్కింది. నటిగా విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ తర్వాత నటించిన రెండు తెలుగు సినిమాలు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చాయి.