ఫెయిల్యూర్ మూవీ.. IMDB లో నెం.1
కానీ కొన్ని సినిమాలు మాత్రం పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం మనం చూశాం.
By: Tupaki Desk | 9 Jan 2024 5:28 AM GMTకొన్ని సినిమాలు అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటాయి, చాలా సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి నిరాశ పరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం మనం చూశాం.
ఇప్పుడు 12th ఫెయిల్ అనే సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీని అద్భుతంగా రూపొందించిన దర్శకుడు వినోద్ చోప్రా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. 12వ తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు ఆ తర్వాత పట్టుదలతో చదివి ఎలా సక్సెస్ అయ్యి ఏకంగా ఐపీఎస్ గా నిలిచాడు అనేది సినిమా కథాంశం.
IMDB లో ఈ సినిమాకు ఏకంగా 9.2 రేటింగ్ దక్కడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా కు అత్యధిక రేటింగ్ నమోదు అవ్వడంతో ఓటీటీ లో ఈ సినిమా ను చూసే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియన్ మూవీస్ లో యానిమేటెడ్ రామాయణం మూవీ 9.2, నాయకుడు 8.6, గోల్‌మాల్ 8.5 రేటింగ్ లతో టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు 12th ఫెయిల్ మూవీ 9.2 రేటింగ్ తో నెం.1 స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రేంజ్ లో సినిమా హిట్ అవ్వడం ను మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఐపీఎస్ మనోజ్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా కథ విషయంలో మొదట చాలా మంది ఆసక్తి చూపించలేదు. కానీ విడుదల అయ్యి పబ్లిక్ టాక్ పాజిటివ్ గా రావడంతో మెల్ల మెల్లగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలు అయ్యింది.. రికార్డు స్థాయిలో సినిమా కు రేటింగ్ ఇవ్వడం జరిగింది.