Begin typing your search above and press return to search.

కొడుకు ఫ్రెండుతో మ‌లైకా డేటింగ్?

అత‌డి పేరు రాహుల్ విజ‌య్. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ వ్య‌క్తి. స్టైలిష్ట్ గా సుప‌రితుడు. అత‌డితో మ‌లైకా డేటింగ్ చేస్తోందంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   11 Dec 2024 8:30 PM GMT
కొడుకు ఫ్రెండుతో మ‌లైకా డేటింగ్?
X

మ‌లైకా అరోరా ఈ ఏడాది ఆరంభంలో అర్జున్ క‌పూర్ నుంచి విడిపోయిన‌ట్టు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత కూడా మ‌లైకా జీవితంలో ఓ షాడో మ్యాన్ ప్ర‌వేశించాడంటూ ముంబై మీడియా రెగ్యుల‌ర్ గా ప్ర‌చారం చేస్తోంది. అర్జున్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సింగిల్ అని ధృవీక‌రించిన త‌ర్వాత మ‌లైకా కూడా తాను ఒంటరిని అని వెల్ల‌డించారు. కానీ మీడియా కొన్నిసార్లు విదేశీ ఔటింగుల పేరుతో మ‌లైకా షాడో మ్యాన్ తో క‌నిపించార‌ని ప్ర‌చారం సాగించింది.

ఇంత‌లోనే ఇప్పుడు మీడియాలో మ‌రో కొత్త ప్ర‌చారం సాగుతోంది. మ‌లైకా త‌న కొడుకు వ‌య‌సు ఉన్న యువ స్టైలిష్ట్ తో ప్రేమ‌లో ఉందంటూ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల ముంబైలో ఏపీ థిల్లాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ లో ఎంతో యాక్టివ్ గా క‌నిపించిన మ‌లైకా ఓ యువ‌కుడితో స‌న్నిహితంగా క‌నిపించింది. అత‌డి పేరు రాహుల్ విజ‌య్. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ వ్య‌క్తి. స్టైలిష్ట్ గా సుప‌రితుడు. అత‌డితో మ‌లైకా డేటింగ్ చేస్తోందంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

కానీ దీనిని మ‌లైకా సన్నిహితులు ఖండించారు. రాహుల్ విజ‌య్ మ‌లైకా కొడుకు అర్హాన్ ఖాన్‌కి స్నేహితుడు అని..ఆ విధంగా అత‌డితో సాన్నిహిత్యం ఉంద‌ని తెలిపారు. మ‌లైకా జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇది అర్థం ప‌ర్థం లేని ప్ర‌చారం అంటూ కొట్టి పారేసిన మ‌లైకా ఇంకా ఒంట‌రిగా ఉన్నారని తెలిపారు.