సమంతతో ఆ దర్శకుడు.. డేటింగ్ అంటారేంటీ?
ఈ వెబ్ సిరీస్ కి రాజ్ నిడుమోరు, డీకే దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 14 Aug 2024 9:15 AM GMT2021లో సమంత, నాగచైతన్యకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తరువాత ఆమె మాయోసైటిస్ బారిన పడటంతో, దానికొసం ఏడాదిపాటు ట్రీట్మెంట్ తీసుకొవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుట పడిన తరువాత యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు కంప్లీట్ చేసింది. ఇదిలా ఉంటే సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది.
ఈ వెబ్ సిరీస్ కి రాజ్ నిడుమోరు, డీకే దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో రాజ్ అండ్ డీకే నెక్స్ట్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా సమంతని లీడ్ రోల్ కోసం తీసుకున్నారు. వరుణ్ ధావన్ కి జోడీగా ఈ యాక్షన్ వెబ్ సిరీస్ లో సమంత నటించింది. నవంబర్ లో ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. అలాగే రాజ్ అండ్ డీకే నిర్మాణంలో రాబోయే రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక పాత్రలో నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది.
అఫీషియల్ గా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే బి టౌన్ లో సమంత గురించి ఇప్పుడు ఊహించని రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బిటౌన్ లో దీని మీదనే చర్చ నడుస్తోంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా సైతం కథనాలు ప్రచారం చేస్తోంది. అలాగే ఇది నిజం కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. సమంత ఫోకస్ ఇప్పుడు తన కెరీర్ పైనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ మీడియాలో మాత్రం నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత నుంచి రాజ్ నిడుమోరు, సమంత మధ్య బంధం బలపడిందని పలు రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని డైరెక్టర్ రాజ్, సమంతలలో ఎవరూ కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు. గతంలో నాగ చైతన్య, శోభిత రెండు సార్లు మీడియా కంట్లో పడ్డారు. అప్పటి నుంచి వారిద్దరూ లవ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది.
అయితే నాగ చైతన్య, శోభిత ఆ రూమర్ ని ఎప్పుడు ఖండించలేదు. ఫైనల్ గా వారి నిశ్చితార్ధంతో ఆ రూమర్ నిజమని అర్ధమైంది. ఇప్పుడు అదే తరహా ప్రచారం రాజ్ నిడుమోరు, సమంతల పైన జరుగుతోంది కాబట్టి వీరు దగ్గరవుతున్నారేమో అనే విధంగా పుకార్లు పుట్టిస్తున్నారు. సమంత డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన తర్వాత మూడు ప్రాజెక్ట్స్ రాజ్ అండ్ డీకే ద్వయంతో చేయడం వలన ఈ ప్రచారం జరుగుతుందనే మాట కూడా వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు రాజ్ నిడుమోరు, సమంత రిలేషన్ గురించే హాట్ టాక్ నడుస్తోంది. అయితే సమంత ఎవరితో రిలేషన్ లో లేదని, అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని ఆమె అభిమానులు ఖండిస్తున్నారు. హీరో నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సమంత, రాజ్ నిడుమోరు రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈ తరహాలో వందకు పైగా రూమర్స్ చాలామంది సెలబ్రెటీలపై రాగా అందులో ఒకటి మాత్రమే నిజమైంది. ఇక శోభితా నాగచైతన్య లవ్ ట్రాక్ నిజమైతే ఇదే కూడా నిజమవుతుందా అనే విధంగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది సమంత లేదా రాజ్ స్పందిస్తే కానీ తెలియదు.