అభిషేక్-ఐశ్వర్యా రాయ్ పై విడాకుల వీడియో!
ఇటీవలే అంబానీ ఇంట ఫ్యామిలీకి బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే...ఐశ్వర్య మాత్రం సపరేట్ గా హాజరైంది.
By: Tupaki Desk | 10 Aug 2024 12:26 PMఅభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్ మధ్య విడాకుల చర్చ ఈనాటిది కాదు. ఏడాది కాలంగా నెట్టింట నడుస్తూనే ఉంది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యా రాయ్ దూరంగా ఉంటుందని ఎన్నో మీడియా కథనాలు వెడెక్కించాయి. కథనాలకు తగ్గట్టు వాళ్ల తీరు సైతం హైలైట్ అయింది. బచ్చన్ ఫ్యామిలీ అంతా ఓవైపు ఉన్నట్లు....ఐశ్వర్య ఒక్కర్తే సింగిల్ గా కుమార్తెతో ఉంటున్నట్లు కొన్ని వీడియోలు సైతం వైరల్ అవ్వడం ఈ కథనానికి మరింత ఊతం ఇచ్చినట్లు అయింది.
ఇటీవలే అంబానీ ఇంట ఫ్యామిలీకి బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే...ఐశ్వర్య మాత్రం సపరేట్ గా హాజరైంది. దీంతో ఈ టాపిక్ మరోసారి నెట్టింట చర్చకు తెర తీసింది. అంతకు ముందు కేన్స్ ఉత్సవా లకు సైతం ఆ కుటుంబం ఇలాగే హాజరైంది. ఇలా ఎన్నో సన్నివేశాలు ఏడాది కాలంగా మీడియా సహా ప్రేక్షకుల్లో చర్చకు దారి తీసింది. అయితే తాజాగా ఈ దంపతులు విడాకులు తీసుకున్నట్లు ఆ విషయాన్ని వీడియోలో అభిషేక్ బచ్చన్ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
అయితే ఇది ఒరిజినల్ వీడియో కాదు. ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అని క్లియర్ గా తెలుస్తుంది. ఏఐ ద్వారా మార్పింగ్ చేసి ఈ వీడియో రిలీజ్ చేసారు. దీని గురించి తెలియని వారు నిజంగా విడాకులు తీసుకున్నారని నమ్మడం ఖాయం. అయితే ఈ వీడియో పై బచ్చన్ ఫ్యామిలీ గానీ, ఐశ్వర్యారాయ్ గానీ ఇంతవరకూ స్పందించలేదు. నిజానికి ఈ విడాకుల ప్రచారంపై వాళ్లెవ్వరూ కూడా ఎక్కడా మాట్లడలేదు. ఇప్పుడు కూడా అదే సన్నివేశం కనిపిస్తుంది.
అయితే ఈ రకమైన ప్రచారానికి కారకుడుగా జిరాక్ మార్కర్ అనే డాక్టర్ పేరు వినిపిస్తుంది. ఇతడు ఐశ్వర్యకి చాలా కాలంగా స్నేహితుడు. ఆ స్నేహమే ఇద్దరి మధ్య కొత్త మలుపు తీసుకుందనే ప్రచారం సాగింది. ఆ కారణంగానే బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యారాయ్ ని దూరం పెడుతుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.