Begin typing your search above and press return to search.

సమంత‌పై త‌ప్పుడు ప్ర‌చారం

ఖాన్ - స‌మంత క‌ల‌యిక‌తో దక్షిణాది ఉత్త‌రాది ప్రాంతాలలో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ తుఫాన్ సృష్టించాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 4:31 AM GMT
సమంత‌పై త‌ప్పుడు ప్ర‌చారం
X

మ‌యోసైటిస్ నుంచి కోలుకుని వ‌రుస చిత్రాల్లో న‌టించేందుకు స‌మంత సిద్ధంగా ఉంది. ముఖ్యంగా సామ్ న‌టించే బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఖ‌రారైంద‌ని ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలొస్తున్నాయి. ఇంత‌కుముందు స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంద‌ని ప్ర‌చారం కాగా, ఇంత‌లోనే ఇప్పుడు షారూఖ్ ఖాన్ స‌ర‌స‌న భారీ చిత్రంలో ఆఫ‌ర్ ద‌క్కించుకుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ వార్త‌ల్లో నిజం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే అవ‌న్నీ ఫేక్ వార్త‌లు అని స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది.

2023లో హ్యాట్రిక్ విజయం సాధించి బాద్షా సింహాసనాన్ని తిరిగి పొందిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు 'జ‌వాన్'లో సౌత్ హీరోయిన్ న‌య‌న‌తార‌కు అవ‌కాశం క‌ల్పించాడు. జ‌వాన్ 1000 కోట్లు పైగా వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. అందుకే ఇప్పుడు మ‌రో సౌత్ బ్యూటీకి షారూఖ్ అవ‌కాశం ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఈసారి జాక్ పాట్ స‌మంత‌ను వ‌రించింద‌ని కూడా ప్ర‌చారం సాగిపోతోంది. అయితే ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.. అవ‌న్నీ గాలి వార్త‌లు అని తేలింది.

డంకీ పెయిర్ షారుఖ్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ మళ్లీ చేతులు కలిపారని, ఈసారి యాక్షన్-అడ్వెంచర్దే కం శభక్తి చిత్రం కోసం క‌లిసి ప‌ని చేస్తున్నార‌ని పుకార్లు వచ్చాయి. SRK వ‌ర‌స హిట్ల‌తో దూకుడు మీద ఉన్నందున ఫ్యాన్స్ ని ఈ వార్త ఎంతో ఎగ్జ‌యిట్ చేసింది. అంతేకాదు.. పుష్ప‌లో 'ఊ అంటావా ' పాట‌తో ఓ ఊపు ఊపిన సమంత షారూఖ్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఖాన్ - స‌మంత క‌ల‌యిక‌తో దక్షిణాది ఉత్త‌రాది ప్రాంతాలలో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ తుఫాన్ సృష్టించాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది.

అయితే ఆ వార్త‌లు నిరాధారమైన పుకార్లు మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. రాజ్‌కుమార్ హిరాణీ డుంకీతో భారీ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌ని ఆశించారు. ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి గొప్ప‌ ప్రశంసలు అందుకుంది.. కానీ భారీ అంచనాలతో పోలిస్తే బాక్సాఫీస్ వ‌ద్ద‌ తక్కువ పనితీరును కన‌బ‌రిచింది. లైఫ్ టైమ్ మొత్తం 232 కోట్లు మాత్ర‌మే రాబట్టిన ఈ సినిమా యావ‌రేజ్ గ్రాస‌ర్.

రాజ్‌కుమార్ హిరాణీ ఇంకా డుంకీ ప‌రాభ‌వం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని కూడా గుస‌గుస ఉంది. అత‌డి తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది. షారుఖ్ ఖాన్‌తో ఒక చిత్రం ఫైన‌ల్ అవ్వాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఖాన్ ఇంకా సరైన సబ్జెక్ట్‌ను కనుగొనే ప‌నిలో ఉన్నాడు. అప్పటి వరకు ఏదీ ఖరారు కాదు అని తెలిసింది. ప్ర‌స్తుతానికి SRK తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి కింగ్‌లో కనిపించనున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా వివ‌రాలేవీ వెల్ల‌డి కాలేదు. కానీ ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో సూపర్‌స్టార్ షారూఖ్ క‌నిపిస్తారు. అత‌డి లుక్ కి సంబంధించిన లీక్డ్ ఫోటో ఇంత‌కుముందు వైరల్‌గా మారింది. వీక్షకులలో ఇది ఉత్కంఠ‌ను పెంచింది.

సుహానా ఖాన్ ఇప్పటికే 'ది ఆర్చీస్‌'తో ఆరంగేట్రం చేయగా.. షారూఖ్ తో ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్ద‌రూ డాన్ లు గా క‌నిపిస్తార‌నే టాక్ ఉంది. అంతే కాకుండా షారుక్ 'టైగర్ vs పఠాన్' లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. పఠాన్ సీక్వెల్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది.