కుటుంబం అనేది మన గతానికి లింక్: అనసూయ
ఇప్పుడు వీళ్లలో ఎవరికీ తగ్గని రీతిలో యాంకర్ కం నటి అనసూయ తన ఫ్యామిలీ లైఫ్‌ని వర్క్ లైఫ్ తో బ్యాలెన్స్ చేస్తూ ఆస్వాధించడం అభిమానులను అబ్బురపరుస్తోంది.
By: Tupaki Desk | 2 Jan 2024 3:54 AM GMTరంగుల ప్రపంచంలో బిజీ లైఫ్ ని మ్యానేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించడం, వాస్తవంలో ఉండటం ఎలానో మన స్టార్లు ప్రత్యక్షంగా చేసి చూపిస్తూనే ఉన్నారు. మహేష్- అల్లు అర్జున్- రామ్ చరణ్- ఎన్టీఆర్ .. వీరంతా హీరోలుగానే కాదు పర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్ లుగా ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు.
ఇప్పుడు వీళ్లలో ఎవరికీ తగ్గని రీతిలో యాంకర్ కం నటి అనసూయ తన ఫ్యామిలీ లైఫ్‌ని వర్క్ లైఫ్ తో బ్యాలెన్స్ చేస్తూ ఆస్వాధించడం అభిమానులను అబ్బురపరుస్తోంది. నేటితరం యాంకర్లలో క్షణం అయినా తీరిక లేనంత బిజీ షెడ్యూళ్లతో ఉండే యాంకర్ కం నటిగా అనసూయ పేరు మార్మోగుతోంది. ఆర్జనలో స్కై ఈజ్ లిమిట్ అని నిరూపిస్తున్న అనసూయ భరద్వాజ్ ఇదిగో తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన అరుదైన ఫోటోగ్రాఫ్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది.
ఈ ఫోటోగ్రాఫ్ లో తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ ఫిటెనెస్ స్టూడియోలో కనిపించారిలా. ఆరోగ్యమే మహాభాగ్యం. దీనికి కుటుంబమంతా కట్టుబడి ఉందని కూడా ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే అర్థమవుతోంది. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి యోగాభ్యాసం, కసరత్తులకు సిద్ధమైతే అది మరింతగా ఆరోగ్యాన్నిస్తుంది. ఫిట్ గా కనిపించడం రంగుల పరిశ్రమలో అవసరం. అదే సమయంలో కుటుంబంతో కలిసి గడపడం ఎలానో కూడా అనసూయ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తోంది.
ఈ అందమైన ఫ్యామిలీ ఫోటోకి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది అనసూయ. ``ఆలోచించదగిన ప్రతి పద్ధతిలో.. కుటుంబం అనేది మన గతానికి లింక్.. మన భవిష్యత్తుకు వారధి.. ఏది ఏమైనా నా కుటుంబంతో గడపడానికి నేను సమయాన్ని వెచ్చించగలను అని సంతోషిస్తున్నాను. కొత్త రోజు.. కొత్త వారం.. కొత్త నెల .. కొత్త సంవత్సరం ఈ విధంగా! ధన్యవాదాలు`` అని వ్యాఖ్యానించారు. కొత్త సంవత్సరం వేళ ఈ సూచన ఎంతో ప్రత్యేకమైనది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమే గాక కుటుంబంతో గడపడమెలానో అనసూయ స్ఫూర్తివంతంగా తన ఫాలోవర్స్ కి వెల్లడించారు. పుష్ప 2 సహా పలు భారీ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే