ఫ్యామిలీ స్టార్… SVP లింక్!
ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్ ప్రామిసింగ్ గా ఉన్న అందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్ ని మాత్రం కొంతమంది మీమర్స్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్లు ఉన్నారు.
By: Tupaki Desk | 19 Oct 2023 4:30 AM GMTపరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో విజయ్ ని ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్ పాత్రలో పరశురామ్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసేలా ఉందని చెప్పొచ్చు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటిస్తోంది. మృణాల్, విజయ్ దేవరకొండ భార్యాభర్తలుగా చిత్రంలో కనిపించబోతున్నారు. పరశురామ్ సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్, మిడిల్ క్లాస్ లైఫ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సోలో, గీతాగోవిందం, సర్కారువారిపాట సినిమాలు అతని టేస్ట్ ఏంటి అనేది చెప్పకనే చెబుతుంది.
ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్ ప్రామిసింగ్ గా ఉన్న అందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్ ని మాత్రం కొంతమంది మీమర్స్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్లు ఉన్నారు. ట్రోలింగ్ చేయడానికి, మీమ్స్ క్రియేట్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచుకొని కూర్చొనే వారికి ఫ్యామిలీ స్టార్ టీజర్ ఆ ఛాన్స్ ఇచ్చింది.
టీజర్ ఎండ్ లో మృణాల్ ఠాకూర్ వేసుకున్న నైటీ డ్రెస్ సర్కారువారిపాట సినిమాలో కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ సిమిలర్ గా ఉండటంతో పరశురామ్ తన పాత సినిమాలో డ్రెస్ లని కూడా వాడేస్తూ దిల్ రాజుకి బడ్జెట్ సేవ్ చేస్తున్నాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. నిజానికి రెండు డ్రెస్ లు ఒకే ఫ్లవర్ డిజైన్స్ తో ఉన్న ఒకే మోడల్ కాదు. ఫ్యామిలీ లేడీస్ ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువగా నైటీలు వేసుకుంటూ ఉంటారు.
దానికి సింబాలిక్ గానే మృణాల్ ఠాకూర్ ని నైటీలో చూపించారు. అయితే ఆ కాస్ట్యూమ్ ని కీర్తి సురేష్ వేసుకున్న కాస్ట్యూమ్ తో పోల్చి చూపిస్తూ ట్రోలింగ్ చేయడంపై రౌడీ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ట్రోల్స్ మూవీకి అదనపు ప్రమోషన్స్ తీసుకొస్తాయి తప్ప నష్టం మాత్రం చేయలేవని చెప్పాలి.