Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. టార్గెట్ కు ఎంత టైమ్ పట్టొచ్చు?

విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఈ వారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2024 4:28 AM GMT
ఫ్యామిలీ స్టార్.. టార్గెట్ కు ఎంత టైమ్ పట్టొచ్చు?
X

విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఈ వారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఆయన ప్రొడక్షన్ నుంచి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందంటేనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు మేగ్జిమమ్ సూపర్ హిట్ అయినవే కావడం విశేషం.

అందుకే ఫ్యామిలీ స్టార్ మూవీ మీద కూడా పబ్లిక్ కి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ మూవీ కావడంతో ఆ రకంగా కూడా సినిమాపైనే హైప్ ఉంది. మృణాల్ ఠాకూర్ మొదటి, రెండు సినిమాల ఫలితం ఏంటో ఆడియన్స్ ఇప్పటికే చూశారు. ఆమె మూడో సినిమాగా ఫ్యామిలీ స్టార్ వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా జనాల్లోకి పాజిటివ్ సౌండ్ ని తీసుకెళ్లింది.

ఏప్రిల్ 5న తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి రాబోతోంది. సమ్మర్ హాలిడేస్ ఆరంభంలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో వీకెండ్ మూడు రోజులు యూత్, ఫ్యాన్స్ హడావిడి ఉన్న తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది.

ఏ మాత్రం మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన కూడా లాంగ్ రన్ లో 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే బ్రేక్ ఈవెన్ కూడా వారాంతం ముగిసేలోపే మినిమం రెండు రోజుల్లో ఫినిష్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకొని ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా అదే స్పీడ్ లో కలెక్షన్లు అందుకుంటే మాత్రం టాలీవుడ్ మరో సాలీడ్ హిట్ పడినట్లే.

అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ప్రాధాన్యత మాత్రం విజయ్ ఫ్యామిలీ స్టార్ చిత్రానికే ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంటే టిల్లు స్క్వేర్ ఎంత కలెక్ట్ చేసిన ఈ మూడు రోజుల వరకే. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఆ ఇంపాక్ట్ టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ మీద ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి అతనికి ఎలాంటి సక్సెస్ ని ఈ చిత్రం అందిస్తుందనేది చూడాలి.