Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అప్పుడే.. ఇది విజయ్ కథ

ఆ తర్వాత తనకు గీతాగోవిందంతో హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశురామ్‌తో చేతులు కలిపాడు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 9:45 AM GMT
ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అప్పుడే.. ఇది విజయ్ కథ
X

చిత్రసీమలో అనేక మంది నటుల్లానే తాను కూడా ఒకే ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. హీరోగానే నటిస్తా అనుకుండా వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చిన్నపాత్రల్లో నటించాడు. కట్ చేస్తే కెరీర్ ప్రారంభమైన వెంటనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. నేటి యువతకు రౌడీ బ్రాండ్గా మారాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. క్లాతింగ్ బిజినెస్తో మార్కెట్లో కూడా దూసుకెళ్తున్నాడు.

అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా విశేష క్రేజ్‌తో సినిమాలు చేశాడు విజయ్. కానీ గతేడాది లైగర్తో ప్లాఫ్ను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత తనకు గీతాగోవిందంతో హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశురామ్‌తో చేతులు కలిపాడు. ఫ్యామిలీ స్టార్ పేరుతో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఓ ఆంగ్లమీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

"నేను చేసిన అన్ని సినిమాల కన్నా ఫ్యామిలీ స్టార్ మూవీతో బాగా కనెక్టయ్యాను. ఎందుకంటే అది నా స్టోరీలానే అనిపించింది. ప్రతీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి తన కుటుంబం మార్గాన్ని మార్చుతారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. ఈ జనరేషన్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పెద్దవాళ్లు చూస్తుంటారు. ఉన్నత విద్య అందించాలని చూస్తారు. కంఫోర్ట్ లైఫ్ ఉండాలని చేస్తారు. నా తల్లిదండ్రులు అలానే కష్టపడ్డారు.

ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్తో నేను బాగా కనెక్టయ్యాను. సూపర్ మార్కెట్లోకి 11 ఆఫర్తో హీరో సామగ్రి కొంటాడు. రోడ్ల డౌన్లోకి వెళ్తే ఇంధనం సేవ్ చేసేందుకు బైక్ ఇంజిన్ ఆఫ్ చేస్తాడు. ఇలా అందరి ఫ్యామిలీలోనూ జరుగుతుంటాయి. నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఆ సినిమా కోసం. గీతాగోవిందం హిట్ ఇచ్చిన పరశురామ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. జనవరిలో షూటింగ్ పూర్తి చేసి మార్చిలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత వర్కింగ్ టైటిల్ VD 12 గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలి. అది చాలా పెద్ద సినిమా. ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉంది" అని తెలిపాడు.

మరోవైపు, విజయ్ దేవరకొండ ఒక పక్క సినిమా స్టార్గా కొనసాగుతూనే ఫ్యాషన్ పట్ల తనకున్న ఇష్టాన్ని తన సొంత రౌడీ క్లాత్ బ్రాండింగ్ ద్వారా చూపిస్తున్నాడు. రౌడీ క్లాత్ బ్రాండింగ్ ఇప్పటికే యూత్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన ఫ్యాన్స్ను రౌడీస్ అంటూ విజయ్ ప్రేమగా పలకరిస్తుంటారు కూడా. తన క్లాతింగ్ బ్రాండ్కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకున్న విజయ్ దేవరకొండ రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ పేరుతో రీలాంఛ్ చేశాడు. తాజాగా ఇంటర్వ్యూలో తన బ్రాండ్పై కూడా మాట్లాడారు.

"ఇండియన్ స్ట్రీట్ కల్చర్ పేరుతో రీలాంఛ్ చేయడం వెనుక కారణం.. హిస్టరీ గురించి తెలుసుకునేందుకే. నేను భారతీయ చరిత్ర గురించి చదువుతుంటాను. ట్రావెలింగ్లో పుస్తకాలు చదువుతుంటాను. పూర్వంలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ మన వస్త్రాధారణ చూసి నేర్చుకున్నారు. ఇండియన్ ఉమెన్ను పెళ్లి చేసుకున్నారు. మన భాషను నేర్చుకున్నారు. మన టెక్స్టైల్, ఫ్యాషన్ను లగ్జరీగా భావిస్తారు. గతేడాది హాలీడే ట్రిప్కు బాలి వెళ్లాను. అక్కడి ప్రజలను చూశాను. వాళ్ల డ్రెస్సింగ్ నాకు చాలా బాగా నచ్చింది. వారు జరుపుకుంటున్న ఓ స్థానిక పండుగను చూశాను. అప్పుడు ఫిక్స్ అయ్యి రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ పేరుతో రీలాంఛ్ చేశాను. RWDY పేరుతో మార్కెట్లోకి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.