టీజర్: పక్కా లెక్కలతో వస్తున్న 'ఫ్యామిలీ స్టార్'
ఇక సినిమా ప్రమోషన్స్ హడావుడి మొదలుపెట్టిన మేకర్స్ నేడు టీజర్ ను విడుదల చేశారు. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
By: Tupaki Desk | 4 March 2024 3:49 PMరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్స్ హడావుడి మొదలుపెట్టిన మేకర్స్ నేడు టీజర్ ను విడుదల చేశారు. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ప్రతిసారి తన డైలాగ్స్ తోనే ఆకట్టుకునే విజయ్ దేవరకొండ మరోసారి తన హావభావాలతో అలాగే అన్ని రకాల ఎమోషన్స్ ను హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ పక్కా లెక్కలతో రాబోతున్నట్లు ఒక్క టీజర్ తోనే తెలియజేశారు. ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ మంచి రాపో సాంగ్ తో టీజర్ కొనసాగింది. ఒకవైపు కుటుంబంలోని అన్ని రకాల బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే మరొకవైపు రౌడీల బెండు తీసే క్యారెక్టర్ లో విజయ్ కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది.
ఇక టీజర్ చివరలో మరింత హైలైట్ అయ్యే విధంగా విజయ్ కొట్టిన డైలాగ్ గట్టిగానే వైరల్ అయ్యేలా ఉంది. ఇంతకుముందు ఐరెనే వంచాలా? ఏంటి అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు టీజర్ చివరలో హీరోయిన్ కాలేజ్ వరకు దించేస్తారా అని అడగడంతో బండిలో పెట్రోల్ కొట్టిస్తే దీంచేస్తాను అని చెప్పడం చాలా సరదాగా ఉంది.
మొత్తానికి సినిమాలో మిడిల్ క్లాస్ పరిస్థితులుకు తగ్గ ఒక మంచి కామెడీ టచ్ ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. విజయ్ తన క్యారెక్టర్ లో ఈసారి మరింత డిఫరెంట్ షేడ్స్ చూపించబోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ గత సినిమాలకంటే భిన్నంగా ఈ సినిమా రాబోతోంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కాస్త యాక్షన్ డోస్ కూడా పరుశురాం జత చేసినట్లు ఈ టీజర్ చెప్పగానే చెప్పేసింది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. మరి ఏప్రిల్ లో రాబోతున్న ఈ సినిమా సినిమా సమ్మర్ హాలిడేస్ ను ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.