Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలే ప్ర‌శంసించేలా అభిమాని ఓ మంచి ప్ర‌య‌త్నం!

మ‌రి ఇదే స్క్విడ్ గేమ్ కోసం ద‌క్షిణాది స్టార్స్ అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? అదిరిపోదు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 6:08 AM GMT
స్టార్ హీరోలే ప్ర‌శంసించేలా అభిమాని ఓ మంచి ప్ర‌య‌త్నం!
X

వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన `స్క్విడ్ గేమ్` వెబ్ సిరీస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే స్క్విడ్ గేమ్ రెండు సీజ‌న్లు గ్రాండ్ స‌క్సెస్ అయ్యాయి. నెట్ ప్లిక్స్ ర్యాంకింగ్ నే మార్చేసిన వెబ్ సిరీస్ ఇది. 92 దేశాల్లో నెట్ ప్లిక్స్ నెంబ‌ర్ వన్ గా ఉందంటే దానికి కార‌ణం స్క్విడ్ గేమ్. రెండ‌వ భాగానికి కొన‌సాగింపుగా మూడ‌వ భాగాన్ని కూడా ప్ర‌క‌టించారు. మ‌రి ఇదే స్క్విడ్ గేమ్ కోసం ద‌క్షిణాది స్టార్స్ అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? అదిరిపోదు.

ఇప్పుడ‌దే జ‌రిగింది. స్టార్ హీరోలు చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్, అజిత్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ధనుష్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్, త్రిష, రానా, బ్రహ్మానందం స్క్విడ్ గేమ్ లోకి ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది. స్టార్స్ అంతా స్క్విడ్ గేమింగ్ డ్రెస్ ల్లో క‌నిపిస్తోన్న ఓ వీడియో, ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఇదంతా జ‌రిగింది ఏఐ క్రియేష‌న్ తో. ఒక‌వేళ మ‌న హీరోలు గేమ్ లో కి ఎంట‌ర్ అయితే గెస్ చేసి ఓ అభిమాని చేసిన ప్ర‌య‌త్నం ఇది. ప్ర‌స్తుతం ఈ వీడియో స్టార్ హీరోల అభిమానులంద‌ర్నీ అల‌రిస్తుంది. నిజంగా ఈ ప్ర‌య త్నాన్ని మెచ్చుకోవాలి. ఏఐ క్రియేష‌న్ తో సెల‌బ్రిటీల అస‌భ్య ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎంత సంచ‌ల‌నమ‌వుతున్నాయో తెలిసిందే. ఏఐ అంటే సెల‌బ్రిటీలంతా భ‌య‌ప‌డి పోయే ప‌రిస్థితి త‌లెత్తింది.

ఎప్పుడు ఏ హీరోయిన్ పై ఎలాంటి వీడియో , ఫోటో బ‌య‌ట‌కు వ‌స్తుందా బెంబెలెత్తేపోయే స‌న్నివేశం ఎదురైంది. కానీ ఈ అభిమాని ఎవ‌రో? సెల‌బ్రిటీలే మెచ్చుకునేలా ఓ మంచి ప్ర‌య‌త్నం చేసాడంటూ నెట్టింట నెటిజ‌నులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు నిజంగా ఆ స్టార్ హీరోలు గ‌నుక చూస్తే వాళ్లు కూడా సంతోషంగా ప్ర‌శంశిస్తారు.