Begin typing your search above and press return to search.

వైర‌స్ (X) తివారీ.. ఇంకెన్నాళ్లు?

ఈ స‌మ‌యంలో ఫ్యామిలీమ్యాన్ 3 స్ట్రీమింగ్ గురించి తాజా అప్‌డేట్ అందింది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 9:30 AM GMT
వైర‌స్ (X) తివారీ.. ఇంకెన్నాళ్లు?
X

తీవ్ర‌వాదం నేప‌థ్యంలో రూపొందించిన 'ఫ్యామిలీమ్యాన్' దేశంలో అత్య‌ధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ల‌లో ఒక‌టి. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లతో అభిమానుల‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం మూడో సీజ‌న్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అయితే ఈ కొత్త సీజ‌న్ రాక కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఫ్యామిలీమ్యాన్ 3 స్ట్రీమింగ్ గురించి తాజా అప్‌డేట్ అందింది.

ఈ కొత్త సీజ‌న్‌ని చూడాలంటే దీపావ‌ళి 2025 వ‌ర‌కూ ఆగాల్సిందే. చిత్రీక‌ర‌ణ, నిర్మాణానంత‌ర ప‌నుల కోసం క‌నీసం ఇంకో 9-12 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ భాజ్ పాయ్ వెల్ల‌డించారు. కొత్త సీజ‌న్ చిత్రీక‌ర‌ణ‌.. స‌వ‌ర‌ణ‌.. ఎడిటింగ్ స‌హా ఇత‌ర ప‌నుల కోసం చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం షో చివ‌రి స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని కూడా వెల్ల‌డించాడు. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 3 బ‌హుభాష‌ల్లో ప్ర‌ద‌ర్శితం అవుతుంది గ‌నుక దాని కోసం స‌బ్ టైటిల్స్ ని కూడా రెడీ చేయాల్సి ఉంటుంద‌ని, మంచి మార్కెట్ వ్యూహాల‌తో ముందుకు వెళ్లాల్సి ఉంటుద‌ని మ‌నోజ్ భాజ్ పాయ్ తెలిపారు. దీపావ‌ళి నాటికి అన్ని ప‌నులు పూర్త‌యి అమెజాన్ ప్రైమ్ లోకి ఈ వెబ్ సిరీస్ వ‌స్తుంది. కొత్త సీజన్‌లో ఎపిసోడ్‌ల సంఖ్య పూర్తిగా ఎడిటింగ్‌పై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.

ఫ్యామిలీ మ్యాన్ 3 - స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీగా నటించారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేసే ఒక మధ్యతరగతి వ్యక్తి. షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరి, దలీప్ తాహిల్, ప్రియమణి, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

కోవిడ్-19 మహమ్మారి ప్ర‌పంచాన్ని ఒణికించింది. చైనా నుండి ప్ర‌పంచ దేశాల‌కు దిగుమ‌తి అయిన వైర‌స్ కార‌ణంగా ప్ర‌జ‌లు అల్ల‌క‌ల్లోలంగా జీవిస్తుంటారు. ఇలాంటి స‌మ‌యంలో జాతీయ భద్రత‌కు బెదిరింపులు ఎదుర‌య్యాక ఆఫీస‌ర్ శ్రీ‌కాంత్ తివారీ ఎలా స్పందించారు? అన్న‌దే క‌థాంశం. ఓవైపు జాతీయ స‌మ‌స్య‌.. మ‌రోవైపు కుటుంబంతో స‌మ‌స్య‌ను శ్రీ‌కాంత్ ఎలా డీల్ చేసార‌నేది సీజ‌న్ 3లో చూపించ‌నున్నారు. గత సీజన్‌ల కంటే కథ చాలా క్లిష్టంగా ఉంటుందని, శ్రీ‌కాంత్ తివారీ పాత్ర మరింత సవాళ్ల‌తో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటుంద‌ని బాజ్‌పేయి చెప్పారు.