'ఫౌజీ'లో ప్రభాస్ లుక్... కొంచెం ఇష్టం, కొంచెం కష్టం!
అనుపమ్ ఖేర్‌తో కలిసి దర్శకుడు హను రాఘవపూడి, హీరో ప్రభాస్‌లు కెమెరాకు ఫోజ్ ఇచ్చి ఆ ఫోటోను షేర్ చేశారు.
By: Tupaki Desk | 14 Feb 2025 5:41 AM GMTప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సమ్మర్‌లోనే సినిమాను విడుదల చేయాలని దర్శకుడు మారుతి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా వార్తల్లో ఉంది. ఎట్టకేలకు షూటింగ్ ముగింపు దశకు చేరిందని సమాచారం అందుతోంది. మరోవైపు ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నాడు. సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఫౌజీ నుంచి అధికారికంగా ఫస్ట్ లుక్ రాలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన సమయంలో ప్రభాస్ లుక్ రివీల్ అయ్యింది.
అనుపమ్ ఖేర్‌తో కలిసి దర్శకుడు హను రాఘవపూడి, హీరో ప్రభాస్‌లు కెమెరాకు ఫోజ్ ఇచ్చి ఆ ఫోటోను షేర్ చేశారు. ఫౌజీ సినిమాలో అనుపమ్ ఖేర్ ఎంట్రీతో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. బాలీవుడ్‌లోనూ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ లుక్ గురించి భిన్న స్పందన వస్తోంది. కొందరు ప్రభాస్‌ను మునుపటి అవతారంలో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ మధ్య కాలంలో ప్రభాస్ ను ఇంత క్లాస్ లుక్‌లో చూడలేదని, కచ్చితంగా ఫౌజీలో ఆయన నటన, లుక్ హైలైట్‌గా నిలుస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ప్రభాస్ లుక్ విషయంలో పెదవి విరుస్తున్నారు. ఫోటోలో ప్రభాస్ కాస్త బరువు పెరిగినట్లు కనిపిస్తున్నారు. ఆయన కల్కి సినిమాలో కాస్త సన్నగా కనిపించాడు. అలాగే రాజాసాబ్‌లోనూ సన్నగా కనిపించబోతున్నాడు. కానీ ఫౌజీలో మాత్రం ఇలా లావుగా ఎందుకు కనిపించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్‌ను దర్శకుడు హను రాఘవపూడి చూపించబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని, త్వరలోనే అధికారికంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాలో ప్రభాస్‌కి జోడీగా సోషల్ మీడియా సెలబ్రెటీ ఇమాన్వీ నటిస్తోంది. ఆమెకు ఇదే మొదటి సినిమా అనే విషయం తెల్సిందే. ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వీ నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా పూజా కార్యక్రమాల్లో ఇమాన్వీ, ప్రభాస్‌ను జోడీగా చూశాం. ఆ సమయంలోనే ఇద్దరి జోడీకి మంచి క్రేజ్ దక్కింది. ప్రభాస్ ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఈ ఏడాది చివరి వరకు 'స్పిరిట్' సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. మరో వైపు సలార్, కల్కి సీక్వెల్ సినిమాల షూటింగ్‌లు ప్రారంభం కావాల్సి ఉన్నాయి.