మోక్షు కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేయమంటున్న ఫ్యాన్స్
అయితే ఫస్ట్ లుక్ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అసలు సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు అందరిలోనూ తారాస్థాయిలో నెలకొన్నాయి.
By: Tupaki Desk | 7 Feb 2025 4:30 PM GMTనందమూరి బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ తేజ ఎప్పుడెప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడతాడా అని ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఇంకా మొదలు కాలేదు.
ఇప్పటికే ఆ మూవీ నుంచి మోక్షజ్ఞ లుక్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్. పవర్‌ఫుల్ స్టోరీతో ఈ సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నాడని అంటున్నారు. అయితే ఫస్ట్ లుక్ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అసలు సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు అందరిలోనూ తారాస్థాయిలో నెలకొన్నాయి.
ఈ అనుమానాలకు తగ్గట్టే ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టితో జై హనుమాన్ ను అనౌన్స్ చేశాడు. అయితే జై హనుమాన్ కంటే ముందే ప్రశాంత్ వర్మ మోక్షుతో సినిమాను తీస్తాడని అంటున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ కూతురు రషా తదానీ కనిపించనుందని గతంలో వార్తలొచ్చాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ కోసం హీరోయిన్ గా ఓ బ్యూటీని తీసుకోవాలని సూచిస్తున్నారు. మోక్షజ్ఞ పక్కన హర్యానా భామ మీనాక్షి చౌదరి అయితే బావుంటుందని ఆమెను తీసుకోవాలని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజంగానే ఫ్యాన్స్ చెప్పినట్టు మోక్షజ్ఞ పక్కన మీనాక్షి అయితే జోడీ చాలా బావుంటుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మీనాక్షి పేరు చాలా గట్టిగానే వినిపిస్తోంది. గతేడాది లక్కీ భాస్కర్ తో సక్సెస్ అందుకున్న మీనాక్షి, ఈ ఏడాది సంక్రాంతికి వెంకీతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అమ్మడికి ఫాలోయింగ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచిందంటున్నారు. మరి ఫ్యాన్స్ సూచన మేరకు మేకర్స్ ఈ కాంబినేషన్ గురించి ఆలోచిస్తారేమో చూడాలి.