Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఈసారి అంత కిక్కు రాలే..

అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ తో ఉన్న పోస్టులే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Oct 2024 9:54 AM GMT
ప్రభాస్.. ఈసారి అంత కిక్కు రాలే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నిన్న పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతో అనేక మంది సెలబ్రిటీలు డార్లింగ్ కు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ తెలిపారు. ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ లో సందడి చేశారు. అనేక చోట్ల పలు స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కటింగ్స్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ తో ఉన్న పోస్టులే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

అదే సమయంలో రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదిరిపోయే చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభాస్ బర్త్ డే రోజు ఆయన అప్ కమింగ్ మూవీస్ నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయని అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఆశించారు. కానీ వారంతా అనుకున్నట్లు మేకర్స్ నుంచి అదిరే అప్డేట్స్ రాలేదని చెప్పాలి.

మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ మూవీని ప్రభాస్ ప్రస్తుతం కంప్లీట్ చేస్తుండగా.. మేకర్స్ టీజర్ రిలీజ్ చేస్తారని అంతా ఎక్సెపెక్ట్ చేశారు. కానీ మోషన్ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ లుక్ సూపర్ గా ఉన్నప్పటికీ.. ఏదైనా గ్లింప్స్ విడుదల చేస్తే బాగుండేదని అనేక మంది డార్లింగ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ తర్వాత హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తోపాటు పోస్టర్ వస్తుందని అంతా అనుకున్నారు.

కానీ ఆ మూవీ మేకర్స్.. ప్రభాస్ కు విషెస్ చెబుతూ మరో సందర్భంలో అప్డేట్ ఇస్తామని పోస్ట్ పెట్టారు. రాజా సాబ్ అప్డేట్ తో ఎంజాయ్ చేయండని కోరారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ షూటింగ్ అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆయన మాత్రం హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ ఓ పోస్టర్ ను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన బర్త్ డే పోస్టర్ కు జస్ట్ కలర్ మార్చి మళ్లీ షేర్ చేసినట్లు కనిపిస్తుంది.

ఇక ప్రభాస్ లైనప్ లో ఉన్న సలార్, కల్కి సీక్వెల్స్ నుంచి ఏదో ఒక చిన్న అప్డేట్ వస్తుందని అనుకోగా.. నిరాశే ఎదురైంది. ఏమైనా కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు వస్తాయనుకున్నా.. అదీ జరగలేదు. ఇప్పటికే ప్రభాస్ నటించిన సినిమాలు కూడా అనుకున్నట్లు ఆరు రీ రిలీజ్ కాలేదు. మొత్తానికి ఈ ఏడాది తమ ఫేవరెట్ హీరో బర్త్ డే రోజు.. ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారనే చెప్పాలి. పెద్దగా కిక్ ఇచ్చే అప్డేట్స్ అయితే రాలేవు. అంతా కలిపి అభిమానులను ఉసూరుమనిపించారు! మరి ఫ్యాన్స్ నిరాశను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ కొత్త చిత్రాల మేకర్స్.. ఈమధ్య రోజుల్లో ఏమైనా సర్ప్రైజ్ లు ఇస్తారేమో చూడాలి.