Begin typing your search above and press return to search.

దేవర 2.. ఇలా అయితే ఎప్పుడు మరి?

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'దేవర' సినిమా ఎట్టకేలకు గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:30 AM GMT
దేవర 2.. ఇలా అయితే ఎప్పుడు మరి?
X

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'దేవర' సినిమా ఎట్టకేలకు గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు కలిగినా, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదట ఆందోళన కలిగించినా, చివరికి వీకెండ్‌లో మంచి వసూళ్లను సాధించగలిగింది. అలాగే సినిమాకు గొప్ప టాక్ ఏమి రాలేదు అలాగని బ్యాడ్ టాక్ కూడా రాలేదు.

విడుదలకు ముందు ఉన్న హైప్, మంచి ప్రమోషన్లు, మరియు బాక్సాఫీస్‌ వద్ద పోటీగా లేకపోవడంతో పరిస్థితులు అనుకూలించాయి. దీంతో వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించగలిగింది. కానీ, వీకెండ్ ముగిసిన తర్వాత కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, గాంధీ జయంతి, దసరా సెలవులు కలిసి రావడంతో వసూళ్లు మళ్లీ పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. అలాగే త్వరలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేకపోతే బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశముంది.

మొత్తం మీద, 'దేవర' ప్రేక్షకులకు అందించిన సానుకూల ఫలితంతో ముందుకెళ్తోంది. బాహుబలి టైమ్ లో కూడా ఇలాంటి అనుమానాల మద్యే సీక్వెల్ సిద్ధమైంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి 'దేవర-2' పై పడింది. 'దేవర-2' ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా లేదా? అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. సాధారణంగా ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు, కొన్ని చిత్రాలు రెండో భాగంకు సంబంధించిన కొంత షూటింగ్ ముందుగానే పూర్తవుతుంది.

అయితే 'దేవర' విషయంలో, రెండో భాగం కోసం ప్రత్యేకంగా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం. 'పార్ట్-1' కోసం తీసిన కొన్ని సన్నివేశాలు రెండో భాగంలో పెట్టుకోవచ్చు కానీ, మరింత కొత్తగా ఎక్కువ షూటింగ్ చేయాల్సి ఉంటుందని టాక్. మరోవైపు ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. 'వార్-2', ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. 'వార్-2' ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టులు ముగిసే వరకు 'దేవర-2' కోసం తారక్ డేట్లు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది.

'దేవర-2' కోసం తారక్, కొరటాల ఇద్దరూ ఒక గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరు ఈ గ్యాప్ లో ఇతర సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇక 2026 తర్వాత 'దేవర-2' షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, కొరటాల కూడా ఈ గ్యాప్‌లో మరో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగా, 'దేవర-2' వచ్చే వరకు ప్రేక్షకులు కొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది. మొత్తం మీద, 'దేవర-2' రిలీజ్ 2027 లేదా 2028 నాటికి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది.