నందమూరి థమన్ బాలయ్య ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచాడా?
బాలయ్య- థమన్ ఎంత క్లోజ్ అయిపోయారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. థమన్ ఇంటిపేరు నందమూరిగానూ మారిపోయింది.
By: Tupaki Desk | 18 Feb 2025 7:05 AM GMTబాలయ్య- థమన్ ఎంత క్లోజ్ అయిపోయారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. థమన్ ఇంటిపేరు నందమూరిగానూ మారిపోయింది. బాలయ్య ఏకంగా తన తమ్ముడు అంటూ సొంతింటి మనిషిలా చూస్తున్నారు. థమన్ కూడ అంతే విధేయతతో నడుచుకుంటున్నాడు. బాలయ్యకు తనలో నచ్చింది ఆ డౌన్ టూ ఎర్త్ క్వాలిటీనే. అందుకే నా తమ్ముడు అంటూ ఎంతో ప్రేమగాను పిలుస్తున్నారు.
ఇక ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సక్సెస్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా `సంక్రాంతికి డాకు మహారాజ్` అంటూ మరో బ్లాక్ బస్టర్ కూడా కొట్టారు. ఈ సినిమా పాటలు సహా బీజీఎమ్ అదిరిపోయింది. ఇక `అఖండ2` విషయంలో థమన్ దరువు, దంపుడు ఎలా ఉంటుందన్నది ఊహకి కూడా అందదని..తనకి కూడా తెలియదని థమన్ ముందే అభిమానుల్ని హెచ్చరించాడు.
దీంతో నందమూరి అభిమానులంతా పుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఓ విషయంలో అదే నందమూరి అభిమానుల్ని థమన్ తీవ్ర నిరుత్సాహానికి గురి చేసాడు. `డాకు మహారాజ్` ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తామన్నారు. దీంతో అభిమానులు ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. కట్ చేస్తే ఆ రోజు రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత అదే నెల 13 కి వాయిదా వేసాం అన్నాడు. ఆ తేదీకి కూడా థమన్ ఓఎస్ టీ ని తీసుకురాలేదు.
13 వతేది దాటి ఇప్పటికి ఐదు రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ ఆ ట్రాక్ జాడలేదు. ట్రాక్స్ తో పాటు సర్కారురా అనే ప్రత్యేక పాటను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఏ హామీ కూడా నిలబెట్టు కోలేక పోయాడు. దీంతో నందమూరి అభిమానులంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. అభిమానుల ఉత్కంఠపై ప్రతీసారి థమన్ నీళ్లు జల్లేస్తున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.