బుచ్చిబాబుకి జాన్వీ అభిమానుల రిక్వెస్ట్!
అయితే రెండవ చిత్రంలో ఆ ఛాన్స్ ఉండకూడదు అంటూ అభిమానులు దర్శకుడు బుచ్చిబాబుకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2024 5:30 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ `దేవర`తో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తంగ పాత్రలో అమ్మడి ఆహార్యం ప్రేక్షకుల్ని అలరించింది. కానీ నటన పరంగా జాన్వీకి అనుకున్నని మార్కులు పడలేదు. దీంతో తెలుగు ఆడియన్స్ కి జాన్వీ అనుకున్నంతగా కనెక్ట్ కాలేకపోయింది. పాత్ర నిడివి కూడా తక్కువగా ఉండటంతో జాన్వీకి ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో తంగ పాత్ర విషయంలో కొన్ని రకాల విమర్శలు వ్యక్తమయ్యాయి.
`దేవర-2`లో ఆ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందా? లేదా? అన్నది పక్కన బెడితే డెబ్యూ విషయంలో జాన్వీకి ఇదొక రిమార్క్ లా మారింది. టాలీవుడ్ లో అమె లాంచ్ అవుతుందని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. ఆమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి టాలీవుడ్ లాంచ్ పై ఎంతటి ఆసక్తి నెలకొందో తెలిసిందే. కానీ అవన్నీ తంగ పాత్ర తుంగలోకి తొక్కేసినట్లు అయింది. ఈ నేపథ్యంలో జాన్వీ అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
అయితే రెండవ చిత్రంలో ఆ ఛాన్స్ ఉండకూడదు అంటూ అభిమానులు దర్శకుడు బుచ్చిబాబుకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 16వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ కి జోడీగా `దేవర` రిలీజ్ కు ముందే ఎంపిక చేసారు. అయితే ఇందులో జాన్వీ పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. తొలి సినిమా లో జాన్వీ పాత్ర వైఫల్యం నేపథ్యంలో రెండవ పాత్రతోనైనా ఆ రకమైన విమర్శలకు సమాధానం చెప్పేలా ఉండాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ రకమైన రిక్వెస్ట్ బుచ్చిబాబు ను కాస్త ఒత్తిడికి గురిచేసే అంశమే. దీంతో హీరోయిన్ పాత్రను ఆయన ఎలా తీర్చి దిద్దాడు అన్నది ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు డెబ్యూ `ఉప్పెన`లో నటించిన హీరోయిన్ కృతి శెట్టి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది లవ్ స్టోరీ కావడంతో హీరోయిన్ పాత్ర అత్యంత కీలకమైంది అందులో. మరి ఆర్సీ 16 స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో జాన్వీ రోల్ ఎలా ఉంటుందన్నది చూడాలి.