Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సినిమాలకు అతిపెద్ద దెబ్బ ఇది!

పెట్టిన పెట్టుబడి రికవరీ చేయాలంటే కచ్చితంగా సినిమాలు కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 11:30 AM GMT
పాన్ ఇండియా సినిమాలకు అతిపెద్ద దెబ్బ ఇది!
X

ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. టైర్ 2, టైర్ 1 హీరోలు అందరూ కూడా యూనివర్సల్ కథలతోనే మూవీస్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాల కారణంగా మూవీ బడ్జెట్ లు పెరిగాయి. అలాగే హీరోల రెమ్యునరేషన్ లు కూడా భారీగా పెరిగాయి. ప్రొడక్షన్ కాస్ట్ కూడా రెట్టింపు అయ్యింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే ప్రస్తుతం 200 కోట్లకి పైగానే నిర్మాతలు బడ్జెట్ లు పెట్టాల్సి వస్తుంది. ఇక టైర్ 2 హీరోలపైన కూడా 50 నుంచి 70 కోట్ల మధ్యలో నిర్మాతలు బడ్జెట్ పెడుతున్నారు.

పెట్టిన పెట్టుబడి రికవరీ చేయాలంటే కచ్చితంగా సినిమాలు కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే. ఒకప్పుడు యావరేజ్ టాక్ వచ్చిన కూడా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు కచ్చితంగా సూపర్ హిట్ టాక్ వస్తేనే మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవుతోంది. లేదంటే నిర్మాతలకి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రికవరీ కావడం లేదు. అయితే సినిమాలకి ఇంత దారుణమైన కలెక్షన్స్ వచ్చేంత బ్యాడ్ కథలు మన మేకర్స్ చెప్పడం లేదు. మంచి కథలే చెబుతున్నారు. కాని ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కావడం లేదు.

మరో సమస్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని విపరీతంగా వేధిస్తోంది. అదే సోషల్ మీడియా ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ క్యాంపైన్స్. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే థియేటర్స్ దగ్గర కొట్లాడుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాలపై దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు నుంచే యాంటీ ఫ్యాన్స్ తమకి నచ్చని హీరో సినిమాపై విష ప్రచారం మొదలు పెడుతున్నారు. మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ని నెగిటివ్ గా పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నారు.

‘సలార్’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి కాబట్టి సరిపోయింది. ఈ సినిమాలపై ముందు నుంచి దారుణమైన నెగిటివ్ ప్రచారం చేశారు. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి మూవీస్ చూసారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపైన కూడా విపరీతమైన నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్ చేస్తున్నారు. మూవీలోని సాంగ్స్ అన్నింటి పైన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. ట్రైలర్ లో కూడా చిన్న చిన్న లోపాలని ఎత్తి చూపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇది సినిమాపై ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. తమకి నచ్చని హీరో సినిమాని వీలైనంత స్థాయిలో డ్యామేజ్ చేయాలని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ చూస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. హీరోల మధ్య మంచి వాతావరణం ఉన్న కూడా ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడు మాత్రమే ఎదగాలి, ఇంకొకరు నాశనం అయిపోవాలి అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్, రకరకాల మార్ఫింగ్ పోస్టర్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

సినిమాకి మొదటిరోజు యునానమస్ గా పాజిటివ్ టాక్ వస్తే సరే, యావరేజ్ అనే రివ్యూలు వస్తే ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపైన్ ఉచ్చులో పడి థియేటర్స్ లో సినిమాలు చూడటం మానేస్తున్నారు. దీంతో మూవీస్ కి దారుణమైన కలెక్షన్స్ వచ్చి కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మారుతున్నాయి. తెలుగులో గత కొన్నేళ్ల నుంచి సక్సెస్ శాతం తగ్గిపోవడానికి సోషల్ మీడియాలో జరిగే ఈ నెగిటివ్ క్యాంపైన్స్ కూడా ఒక కారణం అని మేకర్స్ అంటున్నారు. విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఈ నెగిటివ్ క్యాంపైన్స్, ట్రోలింగ్స్ పై బహిరంగంగానే రియాక్ట్ అయ్యారు. దీనిని బట్టి సోషల్ మీడియా ఏ స్థాయిలో సినిమాల కలెక్షన్స్ ని దెబ్బతీస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.