Begin typing your search above and press return to search.

వేస్ట్ డిస్కషన్.. ఆయ్ కు బెనిఫిట్!

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఆయ్ స్ట్రీమింగ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 4:53 AM GMT
వేస్ట్ డిస్కషన్.. ఆయ్ కు బెనిఫిట్!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. రీసెంట్ గా ఆయ్ చిత్రంతో మంచి విజయం అందుకున్నారన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న థియేటర్లలో చిన్న మూవీగా రిలీజ్ అయ్యి.. విన్నర్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ సాలిడ్ కలెక్షన్లు సాధించింది. రూ.14 కోట్లకు పైగా రాబట్టి మేకర్స్ కు లాభాలు అందించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతోంది.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఆయ్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. స్ట్రీమింగ్ అయిన మూడు రోజుల్లోనే.. నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ లో మూడో ప్లేస్ లోకి దూసుకెళ్లింది. థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజైనా ఓటీటీలోకి వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కావడంతో మంచి వ్యూస్ అందుకుంటోంది ఆయ్.

అదే సమయంలో సోషల్ మీడియాలో ఇప్పుడు మెగా, నందమూరి అభిమానులు అనవసరమైన వాగ్వాదానికి దిగారు. నువ్వా నేనా అన్న విధంగా పోస్టులు పెట్టుకుంటూ వాదించుకుంటున్నారు. సినిమా థియేటర్లలో ఆడుతున్న టైమ్ లో సైలెంట్ గా ఉన్నవారు.. ఇప్పుడు మాత్రం రకరకాల పోస్టులు పెట్టుకుంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. నెట్టింట ఆ వేస్ట్ డిస్కషన్ కు సంబంధించిన పోస్టులే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే సమయంలో అవి ఆయ్ కు పబ్లిసిటీగా మారుతున్నాయి.

ఆయ్ మూవీలో హీరోయిన్ నాన్న బాలయ్య ఫ్యాన్. ఆయనకు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చిరంజీవి అభిమాని అయిన హీరో నాన్న కొడతాడు. ఆ విషయానికి ఎలివేషన్ ఇచ్చి క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు మేకర్స్. సినిమాలో ఆ సీన్ హైలెట్ గా నిలిచింది. పెద్ద వివాదాస్పద సీన్ కాదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ సీన్ ను డైరెక్టర్ కావాలనే పెట్టారని చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఆరోపించుకుంటూ ట్రోల్స్ చేసుకుంటున్నారు.

ఆ సీన్ ను పాజిటివ్ మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటుంటే.. బాలయ్య అభిమానులు ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని సినిమాల్లోని సీన్స్ ను పోస్ట్ చేస్తున్నారు. ఒకరికి ఒకరు పోటీగా పోస్టులు చేస్తూ తమ హీరోలే గొప్ప అని చెప్పుకుంటున్నారు. కానీ చిరు, బాలయ్య.. సినిమాల పరంగా పోటీ పడినా పర్సనల్ గా చాలా సఖ్యతగా ఉంటారు. ఇటీవల జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు చిరంజీవి రావడం.. అప్పుడు మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. కాబట్టి అనవసరమైన వాగ్వాదం ఆపేయడం బెటర్ అని చెప్పాలి.