Begin typing your search above and press return to search.

కల్కి.. ఆ పాత్రపైనే అందరి ఫోకస్!

మధ్యలో కొన్ని మీడియం రేంజ్ చిత్రాలు వచ్చినా అవి ప్యాన్ ఇండియా స్థాయిలో క్లిక్కవడం కష్టం.

By:  Tupaki Desk   |   21 May 2024 2:45 AM GMT
కల్కి.. ఆ పాత్రపైనే అందరి ఫోకస్!
X

కల్కి 2898 ఏడి విడుదలకు ఇంకా 5 వారాల సమయం మాత్రమే మిగిలి ఉండగా, ఈ సినిమా పట్ల అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో కనీస వసూళ్లు లేకుండా ఉండడంతో, కల్కి విడుదలతో పరిస్థితి మారుతుందని అందరూ భావిస్తున్నారు. మధ్యలో కొన్ని మీడియం రేంజ్ చిత్రాలు వచ్చినా అవి ప్యాన్ ఇండియా స్థాయిలో క్లిక్కవడం కష్టం.

అందుకే బాలీవుడ్ వర్గాలు ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. కమల్ హాసన్ పాత్ర ఉన్నందున తమిళనాడు నుంచి భారీ డిమాండ్ రావడం కల్కి విజయానికి మరింత మద్దతు ఇస్తుంది. అయితే, కమల్ హాసన్ పాత్ర నిడివి పట్ల అభిమానులు కొంత అయోమయంగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కమల్, తన పాత్ర క్యామియో అని తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు, కల్కి మొదటి భాగంలో కమల్ హాసన్ పాత్ర 20 నిమిషాలే ఉంటుందని తెలుస్తోంది. రెండో భాగంలో, ఆయన పాత్ర 90 నిమిషాల వరకు ఉండనుందట. అంటే, కమల్ పాత్రకు పూర్తి రూపం రెండో భాగంలో కనబడనుందన్నమాట. ఈ సమాచారం విన్న అభిమానులు ప్రభాస్, కమల్ హాసన్ కలిసి నటించిన సీన్లు ఎక్కువగా ఉండవని అంచనా వేస్తున్నారు.

విశ్వనటుడిని కాస్త ఎక్కువ స్పెస్ లో చూపిస్తే బాగుండు అనేలా అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం కనిపించేది కొద్దీ సేపే అయినా ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చే విధంగా ఉంటుందట. గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ గా కమల్ ని చూపిస్తారట. ఇక ప్రభాస్, కమల్ పాత్రల మధ్య ఉండే లింక్ కూడా సినిమాలో అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది.

ఇక ప్రమోషన్ విషయానికి వస్తే, అశ్వినీదత్ సూచనల మేరకు, కల్కి టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లను నెమ్మదిగా నిర్వహిస్తోంది. జూన్ 4 తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. ఆ సమయంలో ప్రజలు రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టడంతో, సినిమా ప్రమోషన్లను అంత సీరియస్ గా తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు.

కానీ, చివరి ఇరవై రోజుల్లో కల్కి బృందం ప్రమోషన్లను పీక్స్ కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. ఈ సినిమా హిందీ, తెలుగు తదితర భాషల్లో బాహుబలి తరహాలో భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది. కల్కి 2898 ఏడి, ప్రేక్షకులను కట్టిపడేసేలా, భారీ విజయం సాధించేందుకు తగిన అన్ని ప్రమాణాలను పాటిస్తోంది. మరి, ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.