Begin typing your search above and press return to search.

వీడియో: స్టార్ వైఫ్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ క‌ల‌త‌!

వితిక భర్త హీరో వరుణ్ సందేశ్ తో వీడియోలు కొన్ని వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   19 Jan 2024 6:25 PM GMT
వీడియో: స్టార్ వైఫ్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ క‌ల‌త‌!
X

వితిక షేరు.. తెలుగులో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన తెలుగ‌మ్మాయి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కనిపించిన త‌ర్వాత చెప్పుకోద‌గ్గ‌ ఫాలోయింగ్ ని సంపాదించింది. అప్ప‌టి నుంచి వితికకు సోష‌ల్ మీడియాలోను ఫాలోయింగ్ పెరిగింది. లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వితిక తన స్వంత ఛానెల్‌ని ప్రారంభించింది. తన దినచర్యలు, ఇన్ఫర్మేటివ్ వీడియోలను సోషల్ మీడియా ఖాతాల లో షేర్ చేస్తోంది. వితిక భర్త హీరో వరుణ్ సందేశ్ తో వీడియోలు కొన్ని వైర‌ల్ అయ్యాయి.

తాజాగా వితిక షేర్ మ‌రో ఆస‌క్తిక‌ర వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అచ్చ తెలుగు అమ్మాయి చీర‌క‌ట్టు ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో ఆవిష్క‌రించారు వితిక‌. వంగ పువ్వు రంగు ర‌విక కోక‌లో వితిక అద‌ర‌గొట్టేసింది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. చీర కుచ్చిళ్ల‌ను అలా అందంగా న‌డుము వొంపులో దోపుతున్న తీరుకు మంత్ర ముగ్ధులైపోతున్నారు. కొంద‌రు ఇలాంటివి చేయొద్ద‌ని కోర‌గా, మ‌రికొంద‌రు ఇదేమీ త‌ప్పు కాద‌ని కూడా స‌మ‌ర్థించారు.

ఈ ఫోటోతో పాటు అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది వితిక‌. ప్లీట్స్ నుండి పర్ఫెక్షన్ వరకు చీర కట్టుతో మంత్రముగ్దులను చేసే ప్రయాణం అంటూ ల‌వ్ ఈమోజీని వితిక షేర్ చేసారు. అయితే దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. మీరు అందమైన అమ్మాయి.. కాకపోతే పెళ్లి త్వరగా చేసుకున్నారు అంటూ ఒక అభిమాని క‌ల‌త చెందాడు. ``ఇది అవసరమా.... అర్ధం లేని వీడియోలు చేయకండి.. మీ వీడియోలు నిజానికి చాలా స్ఫూర్తిదాయకంగా చూడటానికి బాగున్నాయి.. అంటూ ఒక అభిమాని అన్నాడు. మీరు ఇలాంటి వీడియోలు తియ్యకండి అని ఒక‌రు సూచించ‌గా, మీరు అలా చేయకండి మీ వీడియోలు చాలా నీట్ గా ఉంటాయ్ మేడం ప్లీస్ అంటూ ల‌వ్ ఈమోజీల‌ను కొంద‌రు షేర్ చేసారు.

హలో వితిక గారూ మీరు నిజంగా మంచి దయగల హృదయం గలవారు.. మీరు మంచి కష్టపడి పనిచేసే స్త్రీల వంటి వారు.. ఈ వీడియోలు మీరు చేయాల్సిన‌వి కావు.. కాబట్టి చేయకండి.. మీరు ప్రేరణ .. రిఫ్రెష్ చేసే మహిళలు.. మీరు ఇతరులలా కాదు.. దయచేసి ఇలాంటివి చేయకండి! అని ఒక అభిమాని ఆవేద‌న చెందాడు.

దయచేసి తీర్పు చెప్పడం ఆపండి. తానేమి విప్పుకుని తిరగలేదు.. కేవలం కట్టడం చూపించింది అక్కడేం తప్పుగా తను ప్రవర్తించలేదు . ఎదుటి వారి లిమిట్స్ గురించి మాట్లాడే హక్కు మనకి లేద‌ని గుర్తించండి.. అమ్మాయిలని స్వతంత్రంగా బ్రతకనివ్వండి

నేను మా ప్రసార ఛానెల్‌లో మీ సందేశాన్ని ఇప్పుడే చూశాను. ఇలాంటి చెత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వకండి, దయచేసి మీ స్వంత మార్గంలో వెళ్ళండి. మేము ఎల్లప్పుడూ మీ ప్రేరణను ఇష్టపడతాము.

అక్కా. ఉత్తమ చీర చిత్రీకరణకు ఈ వీడియో బాగుంది. మీరు చూపించే విధంగా బ్లౌజ్ డిజైన్, చీర ధరించే స్టైల్ బాగుంది.. అబ్బాయిలు అపార్థం చేసుకోకండి. సానుకూల మనస్తత్వంతో ఉండండి... అంటూ ఒక్కొక్క‌రూ ఒక్కో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. వితిక స్ట్రైకింగ్ ఫోజ్ క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిపోయింది