Begin typing your search above and press return to search.

అనుష్క ఫ్యాన్స్ ఆందోళన పెంచిన ట్వీట్‌..!

ఇలాంటి సమయంలో ప్రముఖ జర్నలిస్ట్‌ అభిషేక్ త్రిపాఠి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ విరుష్క ఫ్యాన్స్‌ లో ఆందోళన పెంచుతోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 3:41 PM IST
అనుష్క ఫ్యాన్స్ ఆందోళన పెంచిన ట్వీట్‌..!
X

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె గర్భవతి అని వార్తలు రావడం, ఆ తర్వాత అనారోగ్య సంబంధిత వార్తలు రావడంతో అసలు ఏం జరుగుతుంది అనే ఆందోళన విరుష్క ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతోంది.

ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ కు వ్యక్తిగత కారణం చెప్పి కోహ్లీ దూరంగా ఉంటున్నారు. చివరి టెస్టు వరకు ఆయన అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ క్రికెట్‌ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అనుష్క అనారోగ్య పరిస్థితుల కారణంగా కోహ్లీ ఆటకు దూరంగా ఉన్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రముఖ జర్నలిస్ట్‌ అభిషేక్ త్రిపాఠి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ విరుష్క ఫ్యాన్స్‌ లో ఆందోళన పెంచుతోంది. అభిషేక్‌ ట్వీట్ లో... ప్రస్తుతం విరాట్‌, అనుష్క లు విదేశాల్లో ఉన్నారు. విరాట్ కుటుంబం కి సమయాన్ని కేటాయించేందుకు గాను వృత్తిపరమైన విరామంను తీసుకున్నాడు అని అందులో పేర్కొన్నారు.

కీలకమైన టెస్ట్‌ సిరీస్ సాగుతున్న సమయంలో కోహ్లీ విరామం తీసుకోవడం అంటే అది కచ్చితంగా సీరియస్ విషయం అయ్యి ఉంటుంది. ఆ సీరియస్ విషయం అనుష్క యొక్క ఆరోగ్యం అయ్యి ఉండవచ్చు అంటూ చాలా మంది ఊహాగానాలకు తెర తీస్తున్నారు.

ఇంతకు అసలు అనుష్క కి ఏమైంది. ఆమె రెండోసారి గర్భం దాల్చడం అనేది నిజమేనా, దానివల్లే ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుందా అనేది తెలియాలి అంటే వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరవాల్సి ఉంది.