విజయ్ కాంత్ ని చూసి అభిమానులు కన్నీరు మున్నీరు!
అనారోగ్యంతో ఆయన ఎంత క్షీణించారో చూస్తేనే తెలుస్తుంది. బక్కచిక్కిపోయిన శరీరంతో.. కూర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న ఆయనను చూసి పార్టీ కార్యకర్త లు అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.
By: Tupaki Desk | 15 Dec 2023 11:43 AM GMTకోలీవుడ్ లో 'కెప్టెన్' విజయ్ కాంత్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలు చేయకపోయినా విజయ్ కాంత్ అటే తెలియని వారుండరు. 80-90 దశకంలోనే తన ముద్ర వేసారు. 150కి పైగా సినిమాలు చేసిన ఓ లెజెండరీ నటుడాయన. ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేయాలని డీఎండీకే పార్టీని స్థాపించారు. అలా నటుడుగా..ప్రజాసేవకుడిగా విజయ్ కాంత్ తమిళనాట ప్రేక్షకాభిమానుల అదరాభిమానం పొందారు.
ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. విజయకాంత్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రిలో వైద్యం పొంది..డిశ్చార్చ్ అయ్యారు. తాజాగా ఈ మధ్య కాలంలోనూ 20 రోజులుగా సుపత్రిలోనే చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యంపై కొన్ని మీడియా సంస్థల కథనాలు కన్నీరు పెట్టించేలా చేసాయి. చివరికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తాజాగా ఆయనను పార్టీ కార్యక్రమానికి తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఆయన ఎంత క్షీణించారో చూస్తేనే తెలుస్తుంది. బక్కచిక్కిపోయిన శరీరంతో.. కూర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న ఆయనను చూసి పార్టీ కార్యకర్త లు అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. విజయ్ కాంత్ కుర్చీలో స్థిరంగా కూర్చోలేకపోతున్నారు. మనిషి సహకారం లేనిదే కనీసం కూర్చోలేని స్థితిలో కూడా ఆయన ఉన్నారు.
ఆ కార్యక్రమం ముగిసే వరకూ విజయ్ కాంత్ ని పక్కన మరో వ్యక్తి కూర్చుని పట్టుకున్నారు. అలాగే మనుషులను కూడా ఆయన సరిగ్గా గుర్తు పట్టడం లేదని తెలుస్తోంది. ఈ దృశ్యాలు చూసి అభిమానులంతా కంటతడి పెట్టుకున్నారు. నా అభిమాన హీరోని ఇలా చూస్తాను అనుకోలేదు? అంటూ వాపోతున్నారు. మరోవైపు డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీగా విజయ్ కాంత్ భార్య ప్రేమలతను పార్టీ కార్యవర్గం ఎన్నుకుంది.