Begin typing your search above and press return to search.

రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

By:  Tupaki Desk   |   22 March 2024 9:30 AM GMT
రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మే 9న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మొదటి పార్ట్ మేలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తుండగా కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విషయంలో కూడా రెబల్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ లుక్ గా వచ్చిన ప్రభాస్ వింటేజ్ లుక్ రాజా సాబ్ మీద భారీ హైప్ వచ్చేలా చేసింది. మారుతి సైలెంట్ గా సినిమాను పూర్తి చేస్తున్నా ఈ సినిమా నుంచి ఒక్క పోస్టర్ తప్ప మిగతా అప్డేట్ రాలేదని ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్ గా ఉన్నారు.

రాజా సాబ్ టీజర్ కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టీజర్ అప్పుడు ఇప్పుడు అని ఊరిస్తున్నారు తప్ప రాజా సాబ్ టీజర్ ని వదల్లేదు. అయితే కల్కి రిలీజ్ ఉన్న ఈ టైం లో రాజా సాబ్ అప్డేట్ ఇస్తే ఆడియన్స్ లో కన్ ఫ్యూజన్ ఏర్పడుతుందని మేకర్స్ వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటూనే రెబల్ ఫ్యాన్స్ అలరించే యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కుదిరితే ఈ ఇయర్ డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెటుకున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా పండుగకి వస్తే ఆ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. రాజా సాబ్ రెబల్ ఫ్యాన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది వచ్చే సంక్రాంతికి తెలుస్తుంది. సంక్రాంతికి వచ్చే స్టార్ సినిమాలతో పాటు ప్రభాస్ రాజా సాబ్ కూడా రేసులో దిగుతుంది. రాజ ఎంట్రీతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు.