Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఊపు తెప్పించే పనిచేయండయ్యా..!

మొన్నటిదాకా పుష్ప 2 ఎప్పుడొస్తుందా పుష్ప రాజ్ ఈసారి ఏ రేంజ్ లో విశ్వరూపం చూపిస్తాడా అంటూ ఎదురుచూసిన పరిస్థితి కాస్త సీన్ రివర్స్ అయ్యింది.

By:  Tupaki Desk   |   25 July 2024 9:30 AM GMT
పుష్ప 2 ఊపు తెప్పించే పనిచేయండయ్యా..!
X

మొన్నటిదాకా పుష్ప 2 ఎప్పుడొస్తుందా పుష్ప రాజ్ ఈసారి ఏ రేంజ్ లో విశ్వరూపం చూపిస్తాడా అంటూ ఎదురుచూసిన పరిస్థితి కాస్త సీన్ రివర్స్ అయ్యింది. అల్లు అర్జున్ చేసిన ఒక చిన్న పని వల్ల మెగా ఫ్యామిలీ అంతా అతని మీద కోపంగా ఉందని.. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అయితే పీక్స్ లో సోషల్ మీడియాలో పోట్లాడుకుంటున్నాయని తెలిసిందే. అల్లు అర్జున్ కి బాగా దగ్గరైన నిర్మాత కూడా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూపై అవును అన్నట్టే చెప్పుకొచ్చాడు. ఒక మంచి టైం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆ నిర్మాత కామెంట్స్ బయట వినపడుతున్నట్టుగా దూరం ఉందన్న మాట స్పష్టమైంది.

మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ ఎటాక్ చేస్తూ సోషల్ మీడియా అంతా హడావిడి చేస్తున్నారు. ఈలోగా సుకుమార్ కూడా ఆగష్టు 15కి రిలీజ్ కష్టం కానీ డిసెంబర్ 6కి పుష్ప 2 రిలీజ్ అని చెప్పేశారు. పుష్ప 2 పై మొన్నటిదాకా ఉన్న బజ్ అంతా ఈ ఇష్యూస్ వల్ల పోయింది. అసలు పుష్ప 2 అని తలిస్తే చాలు ఇవే ఇవే ఆడియన్స్ మైండ్ లో తిరుగుతున్నాయి. ఐతే ఈ టైం లో పుష్ప 2 గురించి ఒక్క పాజిటివ్ నోట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

పుష్ప 2 గురించి బయట ఎన్ని జరుగుతున్నా వాటిని చిత్ర యూనిట్ పట్టించుకునే ఛాన్స్ లేదు. సో ఆ లెక్కన వాళ్లు చేసే పని చేసుకుంటూ పోతున్నారు. ఐతే ఈ టైంలో పుష్ప 2 నుంచి ఏదైనా టీజర్ కానీ సాంగ్ కానీ వదిలితే ఈ ఇష్యూని వదిలేసి దాన్ని ఎంజాయ్ చేస్తారు. సినిమా మీద నెగిటివిటీని సినిమా అప్డేట్స్ ప్రమోషన్స్ తో కొట్టిపారేస్తే బెటర్ అని అంటున్నారు. పుష్ప 2 నుంచి ఊపు తెప్పించే పని ఏదైనా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

పుష్ప 2 నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ కాగా మూడో సాంగ్ అప్డేట్ కానీ పుష్ప రాజ్ లుక్ కానీ మరోటి వదిలితే మళ్లీ అటెన్షన్ గ్రాబ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి పుష్ప 2 విషయంలో మేకర్స్ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచన ఓకే కానీ సినిమా మీద అడియన్స్ ఫోకస్ పోకుండా ముఖ్యంగా ఈమధ్య జరుగుతున్న వాటికి ఆన్సర్ ఇచ్చేలా పుష్ప 2 అప్డేట్ వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.