Begin typing your search above and press return to search.

ఈసారి మహేశ్ ఫ్యాన్స్ కు నిరాశేనా?

కానీ ఈసారి మాత్రం వారికి నిరాశే ఎదురు కాబోతోందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 July 2024 7:34 AM GMT
ఈసారి మహేశ్ ఫ్యాన్స్ కు నిరాశేనా?
X

ఆగస్టు 9వ తేదీ కోసం సూపర్ స్టార్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు. అంటే ఫ్యాన్స్ కు పండుగ రోజు. ప్రతీ ఏడాది తమ అభిమాన హీరో బర్త్ డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి మహేశ్ నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్లు వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం వారికి నిరాశే ఎదురు కాబోతోందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో? ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారో? అని సినీ అభిమానులంతా వేచి చూస్తున్నారు. ముందుగా ఉగాదికి ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అనుకున్నారు. ఆ తరువాత కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా సమాచారం అందిస్తారని అనుకున్నారు.

ఎలాగూ ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే వుంది కాబట్టి, SSMB29 గురించి ఏదొక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రోజు మేకర్స్ సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇది అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఏదైనా సర్ప్రైజింగ్ అప్డేట్ వస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈసారి మహేష్ నటించిన 'మురారి' సినిమా రీ-రిలీజ్ తో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 4K వెర్షన్ లో గ్రాండ్ గా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం SSMB29 సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు ఈ మూవీ కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో మహేష్ లుక్ టెస్ట్ జరిగినట్లుగా టాక్. లుక్ పరంగానే కాకుండా, ఫిట్ నెస్ పరంగా కూడా మహేష్ ఈసారి భిన్నంగా కనిపించబోతున్నారు. అందుకే జిమ్ లో నిరంతరం వర్కౌట్స్ చేస్తూ కండలు పెంచుతున్నారు.

ఇటీవల అనంత్ అంబానీ పెళ్ళిలో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేశారు. లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో మునుపెన్నడూ చూడని బెస్ట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇది ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. రాజమౌళి రూపొందించే గ్లోబ్ ట్రాటనింగ్ మూవీలో, కొన్ని మార్పులతో మహేశ్ ఇదే లుక్ లో కనిపించే అవకాశం ఉంది.

మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజ్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కెఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.