Begin typing your search above and press return to search.

స‌స్పెన్స్ కి తెర దించేదెప్పుడు మాష్టారు!

అయితే తాజాగా ల‌డ్డాఖ్ నుంచి ప‌ర్హాన్ అక్త‌ర్ ఓ బ్యూటీఫుల్ ఫోటో ని షేర్ చేసాడు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 3:00 AM GMT
స‌స్పెన్స్ కి  తెర దించేదెప్పుడు మాష్టారు!
X

బాలీవుడ్ న‌టుడు కం ఫిల్మ్ మేక‌ర్ ప‌ర్హాన్ అక్త‌ర్ నుంచి `ల‌క్ష్య‌`, `డాన్` ప్రాంచైజీ త‌ర్వాత నటుడిగా బిజీ అయ్యాడు త‌ప్ప‌! ద‌ర్శ‌కుడిగా ప‌ర్హాన్ నుంచి సినిమా రాలేదు. అత‌డు ఎంత గొప్ప న‌టుడో అంత‌కు మించి గొప్ప మేక‌ర్ గానూ స‌త్తా చాటాడు. ఈ ఏడాది ఆరంభంలో `డాన్ -3`ని ప్ర‌క‌టించాడు. ర‌ణ‌వీర్ సింగ్ తో ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్లు తెలిపాడు. అయితే తాజాగా ల‌డ్డాఖ్ నుంచి ప‌ర్హాన్ అక్త‌ర్ ఓ బ్యూటీఫుల్ ఫోటో ని షేర్ చేసాడు.

ప్ర‌స్తుతం తాను ల‌డ్డాక్ లో ఉన్న‌ట్లు రివీల్ చేసాడు. త్వ‌ర‌లోనే ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌స్తుంద‌ని ఊరించాడు. దీంతో నెట్టింట నెటి జనులు ఎవ‌రి ఊహ‌కి వారు ప‌నిచెప్పారు. దీంతో డాన్ -3 ప‌నులు మొద‌ల‌య్యాయి అంటూ కొంత మంది మ‌ధ్య నెట్టింట చర్చ‌కు దారి తీసింది. డాన్ -3 షూటింగ్ అక్క‌డే మొద‌ల‌వుతుంద‌ని అందుకోస‌మే ప‌ర్హాన్ ల‌డ్డాఖ్ లో తిష్ట వేసాడంటూ మాట్లాడుకుంటున్నారు.

మ‌రికొంత మంది ఇది డాన్ -3 కాదు.. `జిందగీ నా మిలేగీ దొబారా`కు సీక్వెల్ కోసం అంటున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోస‌మే అక్క‌డికి వెళ్లాడంటున్నారు. మ‌రి కొంత మంది సీక్వెల్ లో హృతిక్ రోష‌న్ భాగ‌మ‌వుతున్నారా? లేదా? అంటూ అడుగుతున్నారు. మొత్తంగా ప‌ర్హాన్ అక్త‌ర్ ఒక్క ఫోటోతో నెట్టింట పెద్ద చిచ్చే రేపాడు. ప్రాజెక్ట్ వివ‌రాలు చెప్ప‌కుండా? దోబూచులాట మొద‌లు పెట్టాడు.

అత‌డు ద‌ర్శ‌కుడి హోదాలో ల‌డ్డాఖ్ వెళ్లాడా? లేక హీరోగా కొత్త సినిమా కోసం వెళ్లాడా? అంటూ మ‌రికొంత మంది సందేశిస్తున్నారు. మ‌రి ఈ స‌స్పెన్స్ కి ప‌ర్హాన్ ఎప్పుడు తెర దించుతాడో చూడాలి. ప్ర‌స్తుతం న‌టుడిగా ప‌ర్హాన్ అక్త‌ర్ చాలా బిజీగా ఉన్నాడు. చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. కొన్ని సెట్స్ లో ఉన్నాయి.