Begin typing your search above and press return to search.

డాన్ 3 ఆగిపోయిందా? పుకార్ల‌పై ద‌ర్శ‌కుడి ప్ర‌క‌ట‌న‌!

కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన డాన్, డాన్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం కోసం ద‌ర్శ‌క‌ నిర్మాత ఫ‌ర్హాన్ అక్త‌ర్ వంద‌శాతం ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 7:05 AM GMT
డాన్ 3 ఆగిపోయిందా? పుకార్ల‌పై ద‌ర్శ‌కుడి ప్ర‌క‌ట‌న‌!
X

కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన డాన్, డాన్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం కోసం ద‌ర్శ‌క‌ నిర్మాత ఫ‌ర్హాన్ అక్త‌ర్ వంద‌శాతం ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నారు. రణవీర్ సింగ్ `డాన్ 3`లో ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తున్నారు. షారుఖ్ ఖాన్ స్థానంలో డాన్ పాత్రను అత‌డు పోషిస్తాడు. ర‌ణ్ వీర్ ఈ పాత్ర‌ను చేప‌ట్ట‌డంపై ఖాన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ కు దారితీసింది.

అలాగే కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా జాక్ పాట్ అందుకుంది. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపిస్తుందా లేదా? అన్న‌దానిపై ఇప్ప‌టికి స్పష్ఠ‌త లేదు. అయితే ఈ చిత్రం వాయిదా పడిందని.. 2026లో మాత్రమే సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. తాజాగా దర్శక నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో `డాన్ 3`పై రూమ‌ర్ల‌ను ఖండించారు. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉందని, షూటింగ్ 2025 ద్వితీయార్థంలో ప్రారంభమవుతుందని ధృవీకరించారు.

నిజానికి ఈ భారీ యాక్షన్ మూవీ చిత్రీకరణ డిసెంబర్ 2024లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఫర్హాన్ అక్తర్ ఇత‌ర క‌మిట్ మెంట్ల కార‌ణంగా అది సాధ్య‌ప‌డ‌లేదు. చివరి నిమిషంలో షెడ్యూల్‌ను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ప్ర‌స్తుతం అత‌డు డాన్ 3 పై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. మ‌రో ఆరేడు నెల‌ల్లోనే ఈ సినిమాని ప్రారంభించాల‌ని క‌సిగా ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ణ్ వీర్ సింగ్ త‌న పాత్ర కోసం ప్రిప‌రేష‌న్ ని ప్రారంభిస్తార‌ని కూడా చెబుతున్నారు.