Begin typing your search above and press return to search.

చిట్టిలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా?

ప్ర‌స్తుతం అమ్మ‌డి లైన‌ప్ లో మూడు సినిమాలున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `క‌ల్కి 2898` లోనూ భాగ‌మైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 9:33 AM GMT
చిట్టిలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా?
X

హైద‌రాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కెరీర్ స్పీడ‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. `జాతిర‌త్నాలు` తో వెలుగులోకి వ‌చ్చిన అమ్మ‌డు త‌ర్వాత అవ‌కాశాలు బాగానే అందుకుని స‌క్సెస్ లు మాత్రం రాలేదు. అయినా అమ్మ‌డు వేగం త‌గ్గ‌లేదు. య‌ధావిధ‌గా ఛాన్సులు అందుకుంటుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి లైన‌ప్ లో మూడు సినిమాలున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `క‌ల్కి 2898` లోనూ భాగ‌మైన సంగ‌తి తెలిసిందే.

తెర‌పై క‌నిపించేది కాసేపే అయినా? పాన్ ఇండియా ఐడెంటిటీ ద‌క్కింది. త్వ‌ర‌లో అమ్మ‌డు `మత్తు వదలరా 2` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. అయితే ఈసినిమాతో త‌న‌లో మ‌ల్టీట్యాలెంట్ ని బ‌య‌ట‌కు తీసిన‌ట్లు తెలిపింది. సినిమాలో అమ్మ‌డు సొంతంగా ఓ పాట రాసింది. దాన్ని స్వ‌యంగా తానే ఆల‌పించిందిట‌. అంతేకాదు ఆ పాట‌కు తానే కోరియోగ్ర‌ఫీ చేసిందిట‌.

విష‌యం క్రేజీగా లేదు. ఇలా ఎంత‌మంది హీరోయిన్లు ఒకే సినిమాలో ఇన్ని పాత్ర‌లు పోషించ‌గ‌ల‌రు? ఆ లెక్క‌న చూస్తే అమ్మ‌డు ట్యాలెంటెడ్ అనే తెలుస్తుంది. సినిమాతో పాటు ఆ పాట కూడా హిట్ అయితే ఫ‌రియా మంచి ర‌చ‌యిత‌గా, కోరియోగ్రాఫ‌ర్ గా, సింగ‌ర్ గా కూడా రాణించొచ్చు. అస‌లే టాలీవుడ్ లో స‌రైన రైట‌ర్ల కొర‌త ఉంది. అందులోనూ లేడీ రైట‌ర్లు అయితే లేనే లేరు.

ఆర‌కంగా ఫరియాకి ఇది మంచి అవ‌కాశ‌మే. నిజంగా అమ్మ‌డి రైటింగ్ స్కిల్స్ యూనిక్ గా ఉంటే అవ‌కాశాలు వెతుక్కునే ప‌నిలేదు. పిలిచి మ‌రీ ఛాన్సులిస్తారు. కోలీవుడ్ లో కూడా అమ్మ‌డి కెరీర్ ప్రారంభించింది. `వల్లి మ‌యిల్` అనే సినిమాలో న‌టించింది. మ‌రో రెండు..మూడు సినిమాలు చేస్తే ఫ‌రియా కి అక్క‌డా మంచి భవిష్య‌త్ ఉంటుంది.