Begin typing your search above and press return to search.

యాక్షన్ మాత్రమే కాదు సాంగ్ కొరియోగ్రఫీ కూడా..!

సీక్వెల్ హడావిడి కొనసాగుతున్న ఈ టైమ్ లో మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 11:48 AM GMT
యాక్షన్ మాత్రమే కాదు సాంగ్ కొరియోగ్రఫీ కూడా..!
X

సీక్వెల్ హడావిడి కొనసాగుతున్న ఈ టైమ్ లో మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. శ్రీ సింహ కోడూరి హీరోగా కమెడియన్ సత్య ఇంపార్టెంట్ రోల్ లో తెరకెక్కిన సినిమా మత్తువదలరా. రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సూపర్ హిట్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయ్యింది. శ్రీ సింహ ఫరియా అబ్దుల్లా లీడ్ పెయిర్ గా నటించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిరంజీవి, హేమలత నిర్మించగా మైత్రి మేకర్స్ ఈ సినిమా సమర్పించారు. ఈ సినిమా గురించి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మత్తువదలారా 2 ప్రాజెక్ట్ లో ఎలా వచ్చారు? కథ విన్నప్పుడు ఏం అనిపించింది ?

మత్తువదలారా2 ఒక థ్రిల్లర్. యాక్టర్స్ ట్రాజీడీ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది.(నవ్వుతూ). కథ చాలా నచ్చింది. విన్న వెంటనే ఇమ్మిడియట్ గా ఓకే చేసేశా. మత్తువదలారా పార్ట్ 1 బిగ్ హిట్. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కి డిఫరెంట్ గా వుంటుంది. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బాయ్స్ నుంచి స్పెషల్ ఏజెంట్ గా కనిపిస్తారు,

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?

ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నిధి. తను కూడా ఒక స్పెషల్ ఏజెంట్. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ పై సాఫ్ట్ కార్నర్ వుంటుంది. ఇందులో నా క్యారెక్టర్ యాక్షన్ వుంటుంది. మాచో రోల్. అది నాకు చాలా నచ్చింది. గన్స్ తో యాక్షన్ ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశా.

ఈ సినిమాలో లిరిక్స్ రాయడంతో పాటు సాంగ్ పాడాను. డైరెక్టర్ రితేష్ కి ఈ ఆలోచన చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది. అలాగే నా టీంతో సాంగ్ కొరియోగ్రఫీ కూడా చేశాను.

శ్రీసింహ, సత్యలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కదా.. ఆ కాంబోని మీరు ఎలా మ్యాచ్ చేశారు?

నేను అందరితో కలసిపోతాను. వాళ్ళ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కి నా క్యారెక్టర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కాస్త స్మార్ట్ గా వుంటుంది.

డైరెక్టర్ రితేష్ రానా గురించి ?

రితేష్ రానా చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే సాంగ్ కొలాబరేషన్ సాధ్యపడింది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.

కల్కిలో రోల్ చేయడం ఎలా అనిపించింది?

చాలా ఎక్సయిటింగ్ ఎక్స్ పీరియన్స్ అది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి థాంక్ యూ. ప్రభాస్ గారితో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని కోరుకుంటున్నాను.

శ్రీసింహ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

శ్రీసింహ వెరీ ట్యాలెంటెడ్, స్వీట్. చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు. ఆయనతో మళ్ళీ కలసి పని చేయాలని వుంది.

సునీల్, వెన్నెల కిషోర్ పాత్రల గురించి ?

వెన్నెల కిషోర్ గారితో జాతిరత్నాల నుంచి పరిచయం వుంది. సునీల్ గారు జెమ్. వారి పాత్రలు ప్రేక్షకులని చాలా ఎంటర్ టైన్ చేస్తాయి.

కాల భైరవ గారితో కలసి పని చేయడం ఎలా అనిపించింది?

కాల భైరవ గారి మ్యూజిక్ సర్ ప్రైజింగ్ గా వుంటుంది. నా సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?

చాలా సపోర్ట్ చేశారు. చాలా కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. వారితో పని చేయడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ పై ఆసక్తి వుంది. ఈ సినిమాలో పాట రాసిన అవకాశం కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మత్తువదలారాకి పార్ట్ 2కి ఎలాంటి పోలికలు వుంటాయి?

మత్తువదలారా ఫ్యాన్ బేస్ ఇందులో వుండే కంటెంట్ ని చాలా ఎంజాయ్ చేశారు. అలాగే స్టాండ్ లోన్ సినిమాగా కూడా ఈ మూవీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది.

మీరు రియల్ లైఫ్ లో ఫన్నీ గా ఉంటారా ?

నేను జనరల్లీ హ్యాపీ పర్శన్. నా చుట్టూ వుండే వాళ్ళు కూడా హ్యాపీగా వుండాలని చూస్తుంటాను. సరదాగా జోక్స్ చేస్తూవుంటాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి

తిరువీర్ తో ఓ లవ్ స్టొరీ చేస్తున్నాను. ఒక తమిళ్ మూవీ స్టార్ట్ కాబోతోంది.