Begin typing your search above and press return to search.

జాతిరత్నాలు పిల్లకు ఈసారైనా కలిసొచ్చేనా?

అయితే వీరికి సరైన బ్రేక్ పడకపోవడం వలన స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ లు అందుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 8:30 AM GMT
జాతిరత్నాలు పిల్లకు ఈసారైనా కలిసొచ్చేనా?
X

టాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగమ్మాయిలలో స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ దశాబ్దంలో ఒక్కరు కూడా కనిపించరు. అయితే కొంతమంది భామలు మాత్రం హీరోయిన్ గా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. టాలెంటెడ్ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరికి సరైన బ్రేక్ పడకపోవడం వలన స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ లు అందుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది.

గత రెండు దశాబ్దాలలో స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్ అంటే ఒక్క అంజలి మాత్రమే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే నటిగా ఈ బ్యూటీ ప్రూవ్ చేసుకుంది. బేసిక్ గా థియేటర్స్ ఆర్టిస్ట్ కావడంతో జాతిరత్నాలు సినిమాలో చేసిన చిట్టీ క్యారెక్టర్ కి ఫరియా పూర్తి న్యాయం చేసింది. కచ్చితంగా ఫరియా తెలుగులో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుందని అందరూ భావించారు.

అయితే ఎందుకనో ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి ఛాన్స్ లు రాలేదు. ఫేమ్ ఉన్న హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన సక్సెస్ లు రాలేదు. జాతిరత్నాలు తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ మూవీలో ఫరియా సంతోష్ శోభన్ కి జోడీగా నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. రావణాసుర మూవీలో నటించిన ఆమె సెకండ్ లీడ్ గా నటించింది. ఆ ఒక్కటి అడక్కు మూవీలో అల్లరి నరేష్ తో జతకట్టిన హిట్ రాలేదు.

అయితే ఈ సారి మత్తు వదలరా 2 సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూవీలో ఆమె మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాకి రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ ఉంది. ఈ మూవీతో అయిన ఫరియా అబ్దులా సక్సెస్ ని అందుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా మంది హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఫరియా హైట్ ఎక్కువ ఉంటుంది.

ఈ హైట్ ఫరియాకి ఓ విధంగా ప్లస్ అవుతోంది. మరో విధంగా మైనస్ అవుతోందనే మాట వినిపిస్తోంది. యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ఆమె హైట్ తో మ్యాచ్ చేయగలిగే హీరోలు టాలీవుడ్ లో చాలా తక్కువ ఉన్నారు. అయితే ఆమె టాలెంట్ ఇప్పటికే దర్శకుల దృష్టికిలో ఉండటంతో నటిగా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో ఆమెని రిప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా ఆమెకి ఛాన్స్ లు పెరగాలంటే కమర్షియల్ బ్రేక్ మాత్రం రావాల్సిందే.