Begin typing your search above and press return to search.

ఫారియా.. ఆ నవ్వుతోనే గుచ్చేస్తోంది..

ఫారియా ఇప్పటికీ డిఫరెంట్ కధలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 3:46 AM GMT
ఫారియా.. ఆ నవ్వుతోనే గుచ్చేస్తోంది..
X

ఫారియా అబ్దుల్లా తొలి సినిమా "జాతి రత్నాలు"తోనే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తన అల్లరి క్యారెక్టర్‌తో కుర్రకారు అభిమానాన్ని సంపాదించింది. మొదటి సినిమాలో వచ్చిన అంత గుర్తింపు తరువాతి సినిమాల్లో రాకపోయినా, ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు. ఫారియా ఇప్పటికీ డిఫరెంట్ కధలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తోంది.


ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాలా చురుకుగా ఉంటూ అభిమానులతో మమేకమవుతోంది. గ్లామర్ ఫోటోషూట్స్‌తో అప్పుడప్పుడూ షాక్ ఇచ్చేలా చేస్తోంది. ఇటీవల ఫారియా పోస్ట్ చేసిన ఒక స్టిల్ చూసినవారు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంతకుముందు కూడా ఫారియా ఘాటుగా కనిపించినా, ఈ లుక్కు మాత్రం చాలా అందంగా ఉందని పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది.


ఆమె పోస్ట్ చేసిన ఈ కొత్త స్టిల్‌లో ఫారియా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అందంగా దర్శనమిచ్చింది. తన నడుముతో మాయ చేసేసింది. కాఫీ తాగుతున్న అమ్మడు గ్లాస్ తో నవ్వుతూ మరొక స్టిల్ ఇచ్చింది. అమ్మడు క్యూట్ లుక్స్ తన అందాలను హైలెట్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోపై కుర్రాళ్ళు ఫిదా అయిపోయి, కామెంట్లతో హోరెత్తించారు.


ఫారియా గ్లామర్ రోల్స్‌లో చేస్తే ఆమె రేంజ్ పెరుగుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫారియా తనకు తగ్గ డిఫరెంట్ రోల్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమధ్య రవితేజ "రావణాసుర" సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. అలాగే అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది. అది కూడా పెద్దగా హిట్ కాలేదు. అయితే, ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.

ప్రస్తుతం ఫారియా చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయట. ఒకటి తమిళంలో, మరొకటి తెలుగులో ఒక మీడియం రెంజ్ హీరోతో చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలతో మంచి సక్సెస్ వస్తే మళ్లీ ఫారియా బౌన్స్ బ్యాక్ అవుతుందనే ఆశతో ఉంది. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు కూడా ఒప్పుకుంది కానీ ఆ సినిమా అప్డేట్స్ తర్వాత పెద్దగా రాలేదు.

స్టార్ హీరోలతో చేసే అవకాశాలను అందుకోవాలని చూస్తున్న ఫారియా, కష్టపడి పరిశ్రమలో తన స్థానం నిలుపుకుంటుంది. ఫారియా, టాలెంట్, గ్లామర్ ప్రెజెన్స్‌తో త్వరలోనే పెద్ద బ్రేక్ అందుకుంటుందని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఫారియా కూడా వివిధ రకాల కథలను వింటోంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ గా ఉండే ప్రాజెక్టులకు మాత్రం ఆమె ఒకే చెప్పడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఎలాంటి పాత్రలతో హిట్ అందుకుంటుందో చూడాలి.