Begin typing your search above and press return to search.

ఫాస్టెస్ట్ 100K లైక్స్…. దేవర స్థానం ఎంతంటే?

ఈ మధ్యకాలంలో సినిమాల ట్రైలర్, టీజర్, సాంగ్స్ కి యుట్యూబ్ లో వచ్చే రెస్పాన్స్ బట్టి వాటికి పబ్లిక్ నుంచి ఎలాంటి ఆదరణ లభించిందో కేలిక్యులేట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 5:39 AM GMT
ఫాస్టెస్ట్ 100K లైక్స్…. దేవర స్థానం ఎంతంటే?
X

ఈ మధ్యకాలంలో సినిమాల ట్రైలర్, టీజర్, సాంగ్స్ కి యుట్యూబ్ లో వచ్చే రెస్పాన్స్ బట్టి వాటికి పబ్లిక్ నుంచి ఎలాంటి ఆదరణ లభించిందో కేలిక్యులేట్ చేస్తున్నారు. వాటిని రికార్డ్స్ గా చూపిస్తూ చిత్ర నిర్మాతలు పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో ఉపయోగిస్తున్నారు. ఎన్ని ఎక్కువ వ్యూవ్స్, లైక్స్ సొంతం చేసుకుంటే స్పందన అంత హెవీగా ఉందని అర్ధం. అలాగే 24 గంటల్లో వ్యూవ్స్, ఫాస్టెస్ట్ హైయెస్ట్ లైక్స్ వంటివి కూడా కౌంట్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ వీటికి వారి అభిమాన హీరోల స్టామినాగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వ్యూవ్స్ ని దేవర ట్రైలర్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక దేవర ట్రైలర్ 100K లైక్స్ ని అందుకోవడానికి కరెక్ట్ గా 9 నిమిషాల సమయం తీసుకుంది.

నిజానికి దేవర మూవీ ట్రైలర్ అత్యంత వేగంగా 100K లైక్స్ ని అందుకుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనా వేశారు. అయితే అది సాధ్యం కాలేదు. కానీ అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన సినిమా ట్రైలర్స్ జాబితాలో టాప్ 10లోకి మాత్రం దేవర వచ్చింది. వేగంగా 100K లైక్స్ అందుకున్న సినిమా ట్రైలర్స్ జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో డార్లింగ్ ప్రభాస్ సలార్ ట్రైలర్ ఉంది. ఈ మూవీ ట్రైలర్ జస్ట్ 3 నిమిషాల్లో 100K లైక్స్ సాధించింది. తరువాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఉంది.

4 నిమిషాల్లో భీమ్లా నాయక్ ట్రైలర్ 100K లైక్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 7 నిమిషాల్లో 100K లైక్స్ సాధించింది. కల్కి 2898ఏడీ కూడా 7 నిమిషాల్లోనే 100K లైక్స్ రీచ్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీకి 100K లైక్స్ అందుకోవడానికి 8 నిమిషాలు పట్టింది. మహేష్ బాబ సర్కారువారిపాట సినిమాకి 9 నిమిషాలు పట్టింది. ఆదిపురుష్ కూడా 9 నిమిషాల్లో 100K లైక్స్ అందుకుంది. దీని తర్వాత స్థానంలో దేవర ఉంది. నెక్స్ట్ 15 నిమిషాల్లో 100K లైక్స్ అందుకొని టాప్ 9లో ఉంది. టాప్ 10లో ఉన్న అల్లు అర్జున్ పుష్పకి 100K లైక్స్ అందుకోవడానికి 19 నిమిషాలు పట్టింది.

సలార్ – 3 నిమిషాలు

భీమ్లా నాయక్ – 4 నిమిషాలు

వకీల్ సాబ్ – 7 నిమిషాలు

కల్కి 2898AD – 7 నిమిషాలు+

ఆర్ఆర్ఆర్ – 8 నిమిషాలు+

సర్కారువారిపాట – 9 నిమిషాలు

ఆదిపురుష్ – 9 నిమిషాలు+

దేవర – 9 నిమిషాలు+

గుంటూరు కారం – 15 నిమిషాలు

పుష్ప – 19 నిమిషాలు+