Begin typing your search above and press return to search.

తండ్రీ కూతుళ్ల క‌థ‌లు కొత్తేమీ కాదు కానీ..!

తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో టాలీవుడ్ స‌హా ప్ర‌పంచ భాష‌ల‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   8 Oct 2023 2:30 PM GMT
తండ్రీ కూతుళ్ల క‌థ‌లు కొత్తేమీ కాదు కానీ..!
X

తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో టాలీవుడ్ స‌హా ప్ర‌పంచ భాష‌ల‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కూ ప్రేక్షకులు తండ్రీ-కూతుళ్ల బంధంపై ఎన్నో క్లాసిక్ సినిమాల‌ను ఆస్వాధించారు. ఈ ఫార్ములా ఎట‌ర్న‌ల్. ఎప్ప‌టికీ హృద‌యాల‌కు చేరువ‌గా ఉండే క‌థాంశాలు ఇవి. మునుముందు భార‌తీయ సినిమాల్లో ఈ త‌ర‌హా చిత్రాలు మ‌రిన్ని రానున్నాయి. తండ్రి-కూతుళ్ల అనుబంధం ఆధారంగా ప‌లు ఆస‌క్తిక‌ర చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

మునుముందు సౌత్ లో నాలుగు సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. లియో, భగవంత్ కేసరి, సైంధవ్, హాయ్ నాన్నా ఈ కేట‌గిరీలో వ‌స్తున్న చిత్రాలు. ఈ చిత్రాల కథల వెనుక ఉన్న ఆస‌క్తిక‌ర ఎలిమెంట్ తండ్రి కూతుళ్ల అనుబంధం. విజ‌య్ లియోలో అతని గాయపడిన కుమార్తె తో ఎమోష‌న‌ల్ బాండింగ్ నేప‌థ్యం ఎమోష‌న్ ని ర‌గిలించ‌నుంద‌ని తెలుస్తోంది. ద‌ళ‌ప‌తి విజయ్ లియోలో కౌమారదశలో ఉన్న కుమార్తెకు తండ్రిగా నటించారు. త‌న కుటుంబాన్ని కూతురిని కాపాడుకునే వాడిగా విజ‌య్ ఇందులో క‌నిపిస్తాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామా క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో విజ‌య్ ని త‌రుముతూ ఉండే గ్యాంగ్ స్ట‌ర్ల క‌థేమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఫ్యామిలీ సెంటిమెంట్ కుమార్తె ఎలిమెంట్ ని ఇందులో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ బ‌లంగా చూపార‌ని స‌మాచారం. భగవంత్ కేసరితో దర్శకుడు అనిల్ రావిపూడి అదే ఫార్ములాను ఉప‌యోగిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ- శ్రీ‌లీల మ‌ధ్య తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుట్ కానుంద‌ని స‌మాచారం. సైంధవ్‌లో పిల్లలలో అరుదైన వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఖరీదైన ఔషధం దుర్వినియోగానికి వ్యతిరేకంగా విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్నారు. బేబీ సారా పాత్ర ఇందులో కీల‌క‌మైన‌ది. వెంకీ- సారా మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఈ చిత్రానికి కీల‌కం అని టాక్ వినిపిస్తోంది. నాని తదుపరి `హాయ్ నాన్నా`లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఒంటరి తండ్రి అత‌డి గారాల‌ కుమార్తె చుట్టూ తిరిగే క‌థాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలన్నీ మరో మూడు నెలల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కూతురితో తండ్రి అనుబంధం నేప‌థ్యంలో సినిమాల‌న్నీ ఏ మేర‌కు అల‌రించ‌నున్నాయో వేచి చూడాలి.

టాలీవుడ్ లో మ‌రిన్ని క్లాసిక్స్..

తెలుగు సినిమాల్లో తండ్రీ కూతుళ్ల అనుబంధం అనేది పూర్తి స్థాయిలో క‌నిపించ‌వ‌చ్చు. లేదా పాక్షికంగా కొన్ని స‌న్నివేశాల్లోను చూపించ‌డం స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. ముఖ్యంగా తండ్రులు- కుమార్తెల మధ్య గొప్ప‌ బంధం చుట్టూ తిరిగే క‌థాంశాల‌తో రూపొందిన చిత్రాల్లో డాడీ- నువ్వే నువ్వే -నేను శైలజ-పరుగు ఈ జానర్‌లోని కొన్ని ముఖ్యమైన చిత్రాలు. ఈ సినిమాలు తండ్రి - కుమార్తెల‌ మధ్య అనుబంధం భావోద్వేగాలు, ప్రేమ నేప‌థ్యం వీక్షకుల హృదయాలను హత్తుకుంటాయి

మెగాస్టార్ చిరంజీవి- సిమ్ర‌న్ జంట‌గా న‌టించిన డాడీ సినిమాలో కూతురు పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అనారోగ్యంతో బాధ‌ప‌డే కుమార్తెను కాపాడ‌లేక‌పోయిన తండ్రిగా చిరంజీవి ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ ఇందులో ఆక‌ట్టుకుంటుంది. కూతురితో గొప్ప బాండింగ్ ఉన్న తండ్రిగా చిరు ఈ చిత్రంలో క‌నిపిస్తారు. తరుణ్ `నువ్వే నువ్వే` చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. ఇందులో తండ్రి కూతుళ్లు అనుబంధాన్ని ఎంతో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. 2002లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రామ్ - కీర్తి సురేష్ న‌టించిన `నేను శైలజ` తండ్రి కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా. చిన్న బడ్జెట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. బలమైన తండ్రీకూతుళ్ల అనుబంధంతో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా క‌థాంశంతో నేను శైల‌జ తెలుగు వారిని ఆక‌ట్టుకుంది. కీర్తికి తండ్రి పాత్ర‌లో స‌త్య‌రాజ్ త‌న‌దైన‌ నటనతో షో స్టాప‌ర్ గా నిలిచారు.

బ‌న్ని న‌టించిన `పరుగు` క‌థాంశం తండ్రీ కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో ఉంటుంది. బొమ్మరిలు దర్శకుడు భాస్కర్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తెర‌కెక్కించారు. ఇందులో అల్లు అర్జున్ ప్రధాన పాత్ర పోషించ‌గా, మణి శర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్. పరుగు సినిమా తండ్రీ(ప్ర‌కాష్‌రాజ్‌) కూతుళ్ల (షీనా) అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. ప్రకాష్ రాజ్ ఇన్నోసెంట్ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్.. తండ్రి కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తాయి. `నువ్వు నాకు నచ్చావ్` సినిమాలోను ప్ర‌కాష్ రాజ్ కి త‌న కూతురు ఆర్తి అగ‌ర్వాల్ అంటే ప్రాణం. త‌న పెళ్లి చుట్టూ సాగే డ్రామాలో వెంకీ ఏం చేసాడ‌న్న‌ది త్రివిక్ర‌మ్ ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లు, కే. విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో క్లాసిక్ గా తెర‌కెక్కింది ఈ చిత్రం.