4AM ఫ్రెండ్స్‌ని హింసించిన నటి
కొండ కోనల్లో సాహసాలు చేయడానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి తిరిగి ఇంటికి వస్తారో రారో కూడా తెలీదు.
By: Tupaki Desk | 18 Jan 2025 6:30 PM GMTకొందరు మాత్రమే ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. అతికొద్ది మంది మాత్రమే సాహసాలకు వెనకడుగు వేయరు. ధైర్యంగా కొండ కోనలు, గుట్టలు దాటుకుని, సరస్సుల్లో ప్రయాణించి, చివరికి లక్ష్యానికి చేరుకునే ధైర్యం చాలా అరుదుగా ఇలాంటి మహిళలకు మాత్రమే ఉంటుంది. కొండ కోనల్లో సాహసాలు చేయడానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి తిరిగి ఇంటికి వస్తారో రారో కూడా తెలీదు. ఎన్ని హాలీవుడ్ సినిమాల్లో చూడలేదు ఇలాంటి కథల్ని..
పైగా ఇక్కడ గర్ల్స్ గ్యాంగ్ ని వెంట తీసుకుని మరీ సాహసయాత్రకు వెళ్లింది ఫాతిమా సనా షేక్. ఈ దంగల్ బ్యూటీ నిజానికి మొండి పట్టుదల కలిగిన యువతి. తన స్నేహితురాళ్లను తెల్లవారి 4 ఏఎం కే నిదుర లేపి హైకింగ్ కి లాక్కెళ్లిందట. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫాతిమా సనా షేక్ తన సన్నిహితులతో అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్లినప్పటి అరుదైన ఫోటోలను షేర్ చేసింది. అడవులు కొండలు కోనలు సరస్సులు దాటుకుంటూ సాగించిన ప్రయాణంలో ఇవి అద్భుతమైన స్టిల్స్. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూడగానే అలాంటి చోటికి ట్రిప్ వెళ్లే అవకాశం తమకు ఎందుకు రాలేదు? అని చాలామంది నిరాశ చెందుతున్నారు.
ఫైండింగ్ ఫ్యానీ, ముంబై డైరీస్, మోడరన్ లవ్ ఇన్ ముంబై చిత్రాలతో పాపులరైన ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఖండేల్వాల్, ది స్కై ఈజ్ పింక్, ఎ ఫ్లై ఆన్ ది వాల్ , అము చిత్రాలతో పాపులరైన ప్రముఖ దర్శకురాలు షోనాలి బోస్, థార్ , ఉలాజ్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన సినిమాటోగ్రాఫర్-కమ్-ఫిల్మ్ మేకర్ శ్రేయ దేవ్ దూబే, మేకప్ ఆర్టిస్ట్ దిశా సోలంకి, కమినీ, ది సౌండ్ ఆఫ్ ముంబై: ఎ మ్యూజికల్ చిత్రాలతో పాపులరైన సినిమాటోగ్రాఫర్ కవిన్ జగ్తియాని ఈ పర్యటనలో ఆమెతో పాటు ఉన్నారు. దంగల్ గర్ల్ ఫాతిమా మాట్లాడుతూ..''నేను శాడిస్టును కాను కానీ, 4 గంటలకు నిద్రలేచి, గంటల తరబడి హైకింగ్ చేసి, నా స్నేహితులను హీట్ స్ట్రోక్‌తో దాదాపు చంపేసాను'' అని రాసింది. ఒకరికి చీలమండ బెణికింది.. మరొకరి మోకాలికి గాయం అయింది.. అని కూడా తెలిపింది. వారు పరిమితుల్ని మించి అడ్వెంచర్ చేసారని ఫాతిమా వెల్లడించింది.
''మా హైక్ చివరిలో ఆ సరస్సు... ఉఫ్ఫ్! స్వర్గం!'' అని కూడా నోట్ లో రాసింది. తమతో పాటు బొచ్చు కుక్కపిల్ల బిజ్లీ కూడా టూర్ కి వచ్చిందని తెలిపింది. బిజ్లీ మొదటిసారి ఈత కొట్టింది. ఇప్పటివరకు అత్యంత ఎగ్జయిట్ చేసే సంతృప్తికరమైన పుట్టినరోజు ఇది'' అని ఫాతిమా తన 33వ పుట్టినరోజు వెకేషన్ ట్రిప్ గురించి తెలిపింది.
చాలా మంది సోషల్ మీడియాల్లో ఫాతిమా అడ్వెంచర్ ట్రిప్ ని ప్రశంసించారు. మీ స్నేహితులకు హ్యాట్స్ ఆఫ్! .. మీ దృఢ సంకల్పానికి అభినందనలు'' అని రాసారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఫాతిమా 2025 లో మూడు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో మెట్రో ఇన్ డినో, ఉల్ జలూల్ ఇష్క్, ఆప్ జైసా కోయి చిత్రీకరణలో ఉన్నాయి.