Begin typing your search above and press return to search.

చీరందంలో షేక్ చేసిన షాకింగ్ బ్యూటీ!

ఆ పాత్ర‌లో ఫాతిమా సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఎన్నో ప్ర‌శంస‌లు తెచ్చి పెట్టింది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:27 PM GMT
చీరందంలో షేక్ చేసిన షాకింగ్ బ్యూటీ!
X

బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా ష‌నా షేక్ సుప‌రిచిత‌మే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 'దంగ‌ల్' సినిమాతో దేశ‌మంతా ఫేమ‌స్ అయింది. ఆ ఒక్క పాత్ర ఫాతిమా బాలీవుడ్ కెరీర్ నే మార్చేసింది. గీతా ఫోగాట్ పాత్ర‌లో అమ్మ‌డు అభినయించిన తీరు గొప్ప పేరును తీసుకొచ్చింది. ఆ పాత్ర‌లో ఫాతిమా సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఎన్నో ప్ర‌శంస‌లు తెచ్చి పెట్టింది. ఆ సినిమా త‌ర్వాత న‌టిగా బిజీ అయింది.


అంత‌కుముందు మెయిన్ లీడ్స్ లో కొన్ని సినిమాలు చేసినా..ఏ సినిమా తీసుకురాని గుర్తింపు దంగ‌ల్ తీసుకొచ్చింది. ఆ ర‌కంగా ఫాతిమ కెరీర్ లో దంగ‌ల్ ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఇప్ప‌టికీ అదే క్రేజ్ తో అవ‌కాశాలు అందుకుంటుంది. కానీ ఆ రేంజ్ స‌క్సెస్ మాత్రం రావ‌డం లేదు. `థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్` ..`లుడో`.. `సురాజ్ పే మంగ‌ల్ బారీ`.. `అజీబ్ ద‌స్తాన్స్`..`థార్`..`ధ‌క్ ధ‌క్` లాంటి సినిమాలు చేసినా క‌లిసి రాలేదు.

గ‌తేడాది రిలీజ్ అయిన సామ్ బ‌హ‌దూర్ మాత్ర ఊర‌ట‌నిచ్చిన చిత్రంగా నిలిచింది. వీట‌న్నింక‌టే ముందే అమ్మ‌డు టాలీవుడ్ లో `నువ్వు నేను ఒక‌ట‌వుదాం` అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమా స‌క్సెస్ అయి తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చి ఉంటే ఇక్క‌డే ఉండేదేమో. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌టం రేర్. అప్పుడ‌ప్పుడు ఫోటోలు పోస్ట్ చేసినా? ప‌ద్ద‌తైన ఫోటోల‌తోనే మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంది. అమ్మ‌డు గ్లామ‌ర్ షోకి దూరంగా ఉంటుంది. చాలా రేర్ గానే స్కిన్ షో చేస్తుంది.

తాజాగా ఫాతిమా చీరందంలో తళుకులీనింది. లైట్ పింక్ బ్యాక్ గ్రౌండ్ ని మ్యాచ్ చేస్తూ క్రీమ్ క‌ల‌ర్ సారీలో ఒదిగిపోయింది. షోల్డెర్ లెజ్ బ్లౌజు సొగ‌సైన ఫోజులిచ్చింది. చెవుల‌కు దిద్దులు ధ‌రించింది అమ్మ‌డి మ్యాక‌ప్ అల‌కంర‌ణ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ఈసారి మాత్రం కాస్త స్కిన్ షోకి ఛాన్స్ ఇచ్చింది. టోన్డ్ బాడీని హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. న‌డుము ఒంపు సొంపుల్లో య‌ద అందాల‌తో మైమరిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.