నటి ఆడిషన్స్‌కి వెళ్తే దేనికైనా సిద్ధమా అన్నారట
తాజా ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ... కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో ఆడిషన్స్‌కి హాజరు అయ్యాను.
By: Tupaki Desk | 28 Jan 2025 1:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్తగా సినిమాల్లో నటించాలని వచ్చే వారిలో ఎక్కువ శాతం మందికి ఈ అనుభవం తప్పదు. ఆఫర్లు ఇపిస్తాం కానీ కొన్ని కండీషన్స్ ఉంటాయని మొదటే ప్రొడక్షన్ టీం నుంచి మొదలుకుని దర్శక నిర్మాతల వరకు అంటారని గతంలో పలువురు హీరోయిన్స్ చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తనకు ఎదురైనా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇది కామన్‌గా జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది.
తాజా ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ... కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో ఆడిషన్స్‌కి హాజరు అయ్యాను. కొందరు ఆడిషన్స్ పేరుతో టైం పాస్ చేసేవారు. ఆడిషన్స్ తీసుకుని ఆ తర్వాత కనీసం దాన్ని చూసేవారు కాదు, కొందరు అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేయించి ఆ తర్వాత లేదు అనే వారు. ఒక ఆడిషన్‌కి నేను వెళ్లిన సమయంలో సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మీరు దేనికైనా సిద్ధమేనా అని అడిగారు. ఏం చేసేందుకు అయినా సిద్ధమేనా అని వారు ప్రశ్నించడంతో నాకు ఉద్దేశం అర్థం అయ్యింది. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడంకు దేనికైనా సిద్ధమే అని చెప్పాను.
తాను ఇచ్చిన సమాధానం కారణంగా వారి నుంచి నాకు తదుపరి కాల్ రాలేదని, దేనికైనా సిద్ధమే అని చెప్పని కారణంగా వారు నన్ను ఎంపిక చేయలేదని భావించాను అంది. ఈ కాస్టింగ్ కౌచ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరీ దారుణంగా ఉందని ఫాతిమా చెప్పుకొచ్చింది. అక్కడి వారు నేరుగానే షూటింగ్ సమయంలో మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది, కలిసేందుకు అంగీకారమేనా అంటూ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తగా రాణించాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రతిభ ఉండి, ఒక్క అవకాశం దక్కితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఆమె అన్నారు.
గతంలోనూ చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పరిధి పెరగడంతో పాటు, మీడియా యొక్క పరిధి చాలా పెరగడం వల్ల కాస్టింగ్ కౌచ్ కొంత మేరకు తగ్గిందని చెప్పాలి. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే వారు వారంతట వారుగానే లొంగి పోయే విధంగా కొందరు మభ్య పెడుతున్నారు అంటూ కొత్తగా టాక్ వినిపిస్తుంది. కాస్టింగ్ కౌచ్ పద్దతులు మారిందని, అవకాశాల కోసం ఎదురు చూసే అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుని కొందరు మోసం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా రాణించిన ఎంతో మంది హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. కనుక కొత్త అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.