టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి ఆరోపణలు..
అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
By: Tupaki Desk | 31 Jan 2025 11:38 AM GMTదంగల్ నటి ఫాతిమా సనా గురించి అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క మూవీతో వేరే లెవెల్ ఫేమ్ సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి దంగల్ లో ప్రధాన పాత్రలో నటించి మంచి క్రేజ్ దక్కించుకుందనే చెప్పాలి. ఇండియాలో హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన దంగల్.. ఇప్పటికీ ఆ లిస్ట్ లో టాప్ లోనే ఉంది.
అయితే దంగల్ తర్వాత మంచి ఆఫర్స్ అందుకున్న ఫాతిమా వివిధ సినిమాల్లో యాక్ట్ చేసింది. రీసెంట్ గా ఆదిత్య రాయ్ కపూర్ మెట్రో ఇన్ డైనో లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అన్ని ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని తెలిపింది. తాను కూడా ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చింది. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే నార్త్ లో ఈజీగా అవకాశాలు వస్తాయని నమ్మేవాళ్లలో తాను కూడా ఉన్నానని ఫాతిమా తెలిపింది.
"అయితే చాలా మంది విషయంలో అది నిజమైంది. అందుకే నేను కూడా నమ్మా. ఆ తర్వాత టాలీవుడ్ లో నువ్వు నేను ఒకటవుదాం సినిమా చేశాను. దాంతో అందరి దృష్టిలో పడి మంచి అవకాశాలు అందుకున్నా. అందులో భాగంగా ఓ నిర్మాత వద్దకు వెళ్లాను. కానీ ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారు" అని ఆరోపించింది.
ఆ నిర్మాత పేరు ఎప్పటికీ చెప్పనని, కానీ చాలా ఫేస్ చేశానని తెలిపింది. "ఏం చెప్పినా చేయాలని ఆ నిర్మాత అన్నారు. మూవీ పరంగా ఏం చెప్పినా చేస్తా అన్నా. కానీ ఆయన క్యాస్టింగ్ కౌచ్ గురించి డైరెక్ట్ గా మాట్లాడారు. దీంతో చాలా ఇబ్బంది పడ్డా.. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశా" అని ఫాతిమా తెలిపింది.
"క్యాస్టింగ్ కౌచ్ వల్ల చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేశా. ఒకవేళ ఆఫర్స్ వచ్చినా డైరెక్టర్స్ రెమ్యునరేషన్ లో 15 శాతం లాగేసుకునేవారు. 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ తీసుకునేవారు" అంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. అయితే ఫాతిమా చెప్పింది నిజమో కాదో తెలియకపోయినా.. అందరూ డైరెక్టర్లు, నిర్మాతలు అలా ఉండరనే చెప్పాలి.