Begin typing your search above and press return to search.

వృద్దుడితో 30 ఏళ్ల భామ రొమాన్స్!

ఇంత‌కీ ఎవ‌రా న‌టి? ఎవ‌రో వృద్ధుడు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. 54 ఏళ్ల మాధ‌వ‌న్ అలియాస్ మ్యాడీ ఇప్పుడో ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 1:30 PM GMT
వృద్దుడితో 30 ఏళ్ల భామ రొమాన్స్!
X

ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ పడాలంటే స‌మ ఉజ్జీలుండాలి. అప్పుడే ఆ కాంబినేష‌న్ లో కెమిస్ట్రీ వ‌ర్కౌట్ అవుతుంది. కానీ కొన్ని కేసెస్ లో స్టోరీ ప‌రంగా రొమాన్స్ పండించాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆ రూల్ వ‌ర్కౌట్ అవ్వ‌దు. స‌న్నివేశం డిమాండ్ మేరకు న‌టీన‌టులు వివిధ ర‌కాలుగా న‌టించాల్సి ఉంటుంది. అలాంటి న‌టీన‌టుల మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్కౌట్ అవ్వ‌దా? అంటే అలాగ‌ని చెప్ప‌లేం. ల‌స్టో స్టోరీ లాంటి కంటెంట్ అయితే వ‌య‌సు బేధం లేకుండా విచ్చ‌ల వీడి శృంగార స‌న్నివేశాలు జొప్పించొచ్చు.

బాలీవుడ్ లో ఈ త‌ర‌హా కంటెంట్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. తాజాగా 30 ఏళ్ల న‌టి ఓ వృద్దుడితో రొమాన్స్ కి రెడీ అవు తుంది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? ఎవ‌రో వృద్ధుడు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. 54 ఏళ్ల మాధ‌వ‌న్ అలియాస్ మ్యాడీ ఇప్పుడో ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్నారు. ధ‌ర్మాటిక్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఓ యువ‌కుడు-వృద్దిడి మ‌ధ్య జ‌రిగే చ‌మ‌త్కార‌మైన స్టోరీ ఇది. ఇందులో మాధ‌వ‌న్ కి జోడీగా ఫాతిమా ష‌నా షేక్ న‌టిస్తోంది.

అంటే వృద్దుడి పాత్ర‌లో మ్యాడీ క‌నిపించ‌నున్నారుట‌. ఇందులో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ బంధాన్ని, రొమాంటిక్ యాంగిల్ ని పీక్స్ లో రాసారుట‌. ఇరువురి మ‌ధ్య కొన్ని ఇంటిమేట్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ట‌. స్టోరీలో భాగంగా కొన్ని స‌న్నివేశాలు డిమాండ్ చేయ‌డంతో వాటిని జోడించిన‌ట్లు మేక‌ర్స్ చేబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే నెల‌లో మొద‌ల‌వుతుంది.

అయితే ఇంత‌వ‌ర‌కూ ఈ సినిమాకి డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. అలాగ‌ని మాధ‌వ‌న్ టేక‌ప్ చేస్తున్నాడా? అంటే అదీ రివీల్ చేయ‌లేదు. క‌న్న‌డ మీడియాలో మాధ‌వ‌న్- ఫాతిమా ష‌నా షేక్ మ‌ధ్య రొమాన్స్ జ‌రుగుతుంద‌నే విష‌యం మాత్రం లీకైంది. ఇక మ్యాడీలో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌డికి ఎలాగూ రొమాంటిక్ స్టార్ అనే ట్యాంగ్ ఉంది. అప్ప‌టిత‌రం అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు. అలాంటి రాకుమారిడితో ఫాతిమా కి ఆ ఛాన్స్ దక్కింది.