నా బలం వెనక శక్తి.. కూతురితో ఫాతిమా ఆంటోని అనుబంధం!
ఇంతకీ ఫాతిమా షేర్ చేసిన పాత సోషల్ మీడియా సందేశం ఏమిటి? అంటే.. మార్చిలో, ఫాతిమా చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ పాఠశాలలో సాంస్కృతిక కార్యదర్శి అయిన తర్వాత .
By: Tupaki Desk | 19 Sep 2023 1:39 PM GMTస్వరకర్త-నటుడు విజయ్ ఆంటోనీ - ఫాతిమా దంపతుల కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్యతో మరణించిన సంగతి తెలిసిందే. చిన్నారి భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నై-అల్వార్‌పేటలోని ఇంటికి తీసుకు వెళ్లారు. నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ తరుణంలో తన ముద్దుల కూతురు మీరా కోసం నిర్మాతగా ఉన్న ఫాతిమా త్రోబాక్ పోస్ట్ ఇప్పుడు మరణం తర్వాత వైరల్ అవుతోంది.
కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని పరిశ్రమల్లో ప్రముఖులు విజయ్ ఆంటోని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. ఖుష్బు సుందర్, దళపతి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ నివాళులర్పించేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. జయం రవి, ఆర్జే బాలాజీ, శరత్‌కుమార్, పలువురు తారలు సంతాపం తెలిపారు. టాలీవుడ్ నుంచి పలువురు సన్నిహితులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.
ఇంతకీ ఫాతిమా షేర్ చేసిన పాత సోషల్ మీడియా సందేశం ఏమిటి? అంటే.. మార్చిలో, ఫాతిమా చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ పాఠశాలలో సాంస్కృతిక కార్యదర్శి అయిన తర్వాత .. తన కుమార్తె మీరా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పోస్ట్ లో ఇలా ఉంది. "నా బలం వెనుక ఉన్న శక్తి.. నా కన్నీళ్లకు ఓదార్పు. నా ఒత్తిడికి కారణం (కొంటెతనం సూపర్ లోడ్ అయింది).. నా తంగకట్టి-చెల్లకుట్టి. మీరా విజయ్ ఆంటోని కంగ్రాట్స్ బేబీ (sic)" అని రాసింది. తల్లి కూతుళ్ల అనుబంధంపై ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. చిన్నారి బలవన్మరణం అందరినీ కలచి వేస్తోంది.
విజయ్ ఆంటోని కోలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు. నటుడు, దర్శకుడిగాను రాణించాడు. అతను ఎడిటింగ్, లిరిక్స్ రాయడంలోను రాణించడమే గాక సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసారు. నిర్మాతగా పలు సినిమాలను కూడా నిర్మించాడు. తన భార్య ఫాతిమాతో కలిసి విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. వీరికి మీరా, లారా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
విజయ్ ఆంటోని కూతురు మీరా 16 ఏళ్ల వయసులో తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయం తీసుకోవడం కలచివేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చాలా ఆలస్యం కావడంతో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని చెన్నై ఆళ్వార్‌పేటలోని స్వగృహానికి తరలించారు. అంతిమ నివాళులు అర్పించేందుకు ప్రముఖులు వారి ఇంటికి చేరుకున్నారు.