Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల దంగల్‌ కొంటె చూపు అదుర్స్

పుట్టిన ఐదేళ్లకే సినిమాల్లో కనిపించిన ఫాతిమా సనా షేక్‌ బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది

By:  Tupaki Desk   |   20 Jun 2024 11:59 AM GMT
పిక్ టాక్ : అందాల దంగల్‌ కొంటె చూపు అదుర్స్
X

పుట్టిన ఐదేళ్లకే సినిమాల్లో కనిపించిన ఫాతిమా సనా షేక్‌ బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. నటిగా పలు సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడికి 2016 లో వచ్చిన దంగల్ సినిమాతోనే గుర్తింపు లభించింది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూతురు పాత్రలో నటించిన ఫాతిమా ఆ తర్వాత ఆయనకు జోడీగా నటించింది.

ఫాతిమా సనా షేక్ గురించి మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ అమ్మడు సినిమాలతో కంటే కూడా ఎక్కువగా అందాల ఫోటో షూట్స్ అంతకు మించి వివాదం వల్ల వార్తల్లో నిలుస్తోంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సామ్ బహదూర్ సినిమాలో నటించింది.

అందాల దంగల్ బ్యూటీ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల షో చేయడం కామన్ విషయం. తాజాగా మరోసారి తన అందాల ఫోటోలతో ఆకట్టుకుంది. క్యూట్‌ అండ్‌ స్వీట్ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌ పాల వర్ణపు స్కిన్‌ టోన్ తో కన్నుల విందు చేసింది.

వైట్ డ్రెస్ లో చూపు తిప్పుకోనివ్వని అందం ఈ అమ్మడిది. పైగా కవ్వించే విధంగా ఆ చూపులతో చంపేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదా... లేదంటే ఆమె నే ఎక్కువగా సినిమాలకు కమిట్‌ అవ్వడం లేదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో ఈ అమ్మడిని చూడాలని కొందరు కోరుకుంటున్నారు. దంగల్ కంటే ముందు ఒక తెలుగు సినిమాలో నటించిన ఈ అమ్మడు నిరాశ పరిచింది. కానీ ఇప్పుడు తెలుగు లో నటిస్తే మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.