Begin typing your search above and press return to search.

దంగల్ బ్యూటీ అందాల వల.. స్టన్నింగ్

అలా తాజాగా ఫాతిమా.. ఓ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్​ మోడ్రన్ ఔట్​ ఫిట్​ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:38 PM GMT
దంగల్ బ్యూటీ అందాల వల.. స్టన్నింగ్
X

దంగ‌ల్​ చిత్రంతో ఫేమ‌స్ అయిన ఫాతిమా స‌నాషేక్​ సినీ ప్రియులకు బాగా తెలిసిన నటి. ఆ చిత్రంలో అథ్లెట్ పాత్ర‌లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పటి వరకు ఎన్ని చిత్రాల్లో నటించిన రాని గుర్తింపు ఈ చిత్రంతో సంపాదించుకుంది. ఆ తర్వాత పలు బడా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఫొటోషూట్లు చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫొటోషూట్​తో​ మైండ్ బ్లో చేసింది.


వివరాళ్లోకి వెళితే.. దంగల్ తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ.. వ‌రుస‌గా స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్, లూడో, థార్,సామ్ బ‌హదూర్ వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే ఈ చిత్రాలేమీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమె కెరీర్ పైనా కొంత ఎఫెక్ట్ పడింది. కాస్త సినిమాల్లో కనిపించడం తగ్గించింది.

అయినా ఆమె ఏదో ఒక దాంట్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఇదే క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టివ్ గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోట‌ల‌తో హాట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది. త‌న‌దైన అంద చందాల‌తో ఎప్పటికప్పుడు ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. మైండ్ బ్లోయింగ్​గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతుంది.

అలా తాజాగా ఫాతిమా.. ఓ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్​ మోడ్రన్ ఔట్​ ఫిట్​ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. నెక్​ అండ్​ షోల్డర్​ లెస్​ డ్రెస్​లో కిక్కిచ్చే పరువాల ప్రదర్శనతో హార్ట్ బీట్ పెంచేలా కనిపించింది. స్టైలిష్ హెయిర్ స్టైల్​తో, లిపిస్టిక్​ వేసుకుని, చేతికి మ్యాచింగ్ ఉంగరం పెట్టుకుని ఆకట్టుకుంది. నడుము మడతను లైట్​గా చూపిస్తూ... కాస్త మత్తు కళ్లతో మస్త్​ పోజిచ్చింది.

అలా కుర్ర హృదయాలను మరోసారి కలవరపెట్టింది. ఈ గ్లామర్​ పిక్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ‌డి ఫాలోవ‌ర్లు స్వీట్​, బ్యూటీఫుల్ అంటూ హార్ట్ అండ్ హాట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.