Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫౌజీలో హాలీవుడ్ యాక్ట‌ర్

రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ప్ర‌భాస్ సైనికుడిగా క‌నిపించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి.

By:  Tupaki Desk   |   22 Feb 2025 7:17 AM GMT
ప్ర‌భాస్ ఫౌజీలో హాలీవుడ్ యాక్ట‌ర్
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అందరికీ భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ప్ర‌భాస్ సైనికుడిగా క‌నిపించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి.

ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫౌజీలో ర‌జాకార్ల నేప‌థ్యంలో సాగే ఓ భారీ ఎపిసోడ్ ఉంటుందట‌. ఈ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలవ‌నుంద‌ని అంటున్నారు.

ఈ విష‌యం బ‌య‌టికొచ్చిన ద‌గ్గ‌ర నుంచి అంద‌రికీ ఫౌజీపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫౌజీలో ర‌జాకార్ల ఎపిసోడ్ లో ఎమోష‌న్స్ కు, యాక్ష‌న్ కు పెద్ద పీట వేయ‌బోతున్నార‌ని దానికి సంబంధించిన సీన్స్ ను మార్చిలో షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో ఓ కీల‌క పాత్ర ఉంద‌ట‌.

ఆ కీల‌క పాత్ర కోసం ఓ హాలీవుడ్ యాక్ట‌ర్ ను రంగంలోకి దింపుతున్నాడ‌ట డైరెక్ట‌ర్ హ‌ను. స‌ద‌రు న‌టుడు ఆ పాత్ర కోసం దాదాపు ఆరు నెల‌లుగా మేకోవ‌ర్ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఆ హాలీవుడ్ యాక్ట‌ర్ ఎవ‌ర‌నేది చిత్ర బృందం త్వ‌ర‌లోనే అనౌన్స్‌చేయ‌నుంద‌ట. మొత్తానికి ఫౌజీ కోసం హ‌ను ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు, ఫౌజీలో ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ని, మునుపెన్న‌డూ చూడ‌ని యాంగిల్ లో ప్ర‌భాస్ ఈ ఫ్లాష్ బ్యాక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి. మ‌రి అందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియ‌దు. ఏదేమైనా ఫౌజీ సినిమా ఏదొక అప్డేట్ తో నిరంతరం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది.