Begin typing your search above and press return to search.

పార్ట్ -2 లో ఆ స్టార్ కు ఛాన్స్ ఉంటుందా?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కెరీర్ బుల్లితెర‌పైనే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 1989 లో `ఫౌజీ` అనే టీవీ సిరీస్ తో న‌టుడిగా తెరంగేట్రం చేసాడు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 8:30 AM GMT
పార్ట్ -2 లో ఆ స్టార్ కు ఛాన్స్ ఉంటుందా?
X

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కెరీర్ బుల్లితెర‌పైనే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 1989 లో `ఫౌజీ` అనే టీవీ సిరీస్ తో న‌టుడిగా తెరంగేట్రం చేసాడు. అప్ప‌ట్లో పౌజీ దూర‌ద‌ర్శ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యేది. ఎంతో పెద్ద స‌క్సెస్ సాధించిన సీరియ‌ల్ ఇది. 13 ఎపిసోడ్లు దిగ్విజ‌యంగా ఆడింది. అందులో న‌టించిన వారంతా ఎంతో ఫేమ‌స్ అయ్యారు. అంద‌ర్నీ మించి షారుక్ ఖాన్ కి ప్ర‌త్య‌క‌మైను గుర్తింపు ద‌క్కింది.


దీంతో షారుక్ మెరుగైన అవ‌కాశాలు అందుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల పాటు బుల్లి తెర‌పై ఓ వెలుగు వెలిగాడు. ఆ త‌ర్వాత 1992లో బుల్లి తెర నుంచి వెండి తెర‌కు ప్ర‌మోట్ అయ్యాడు. షారుక్ ఖాన్ బాలీవుడ్ లో స‌క్సెస్ అయిన త‌ర్వాత పౌజీ సీరియల్ కి మ‌రింత ఫేమ‌స్ అయింది. షారుక్ ఖాన్ న‌టించిన `పౌజీ` క‌దా అంటూ దేశ వ్యాప్తంగా అభిమానులు మాట్లాడుకున్నారు.

అంటే ఇండ‌స్ట్రీలో షార‌క్ ఖాన్ ఆ స్థాయికి ఎదిగాడు. ఈ నేప‌థ్యంలో షారుక్ బ్రాండ్ ఇమేజ్ తో ఫౌజీకి సీక్వెల్ ప్ర‌క‌టించారు. `ఫౌజీ-2`ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దూర‌ద‌ర్శ‌న్- సందీప్ సింగ్ సంయుక్తంగా దీన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ఫౌజీ అంటే ఆర్మీ నేప‌థ్యంతో కూడిన క‌థ‌. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ రిలీజ్ చేసారు. ఇందులో ప్రముఖ గౌహర్ ఖాన్ , విక్కీ జైన్ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

మ‌రి ఈ ప్ర‌తిష్టాత్మ సిరీస్ లో షారుక్ ఖాన్ కూడా చిన్న రోల్ పోషిస్తే బాగుటుంది అన్న‌ది అభిమానుల అభిప్రాయం. ఆయ‌న న‌ట జీవితం ఇదే సిరీస్ తో ప్రారంభ‌మైంది కాబ‌ట్టి ఇదో మంచి ప‌రిణామం. మ‌రి ఈ విష‌యంలో చొర‌వ తీసుకోవాల్సింది షారుక్ ఖాన్ మాత్ర‌మే.