సలార్ (X) డంకీ: పాట పాడే ఛాన్సిచ్చినందుకా ఈ ఫేవర్?
అందువల్లనే ఇప్పుడు తమ సినిమా స్క్రీన్లలో ఖాన్ డంకీకి ఐనాక్స్ ఎండి బిజిలీ ప్రాధాన్యతనిచ్చారని కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది.
By: Tupaki Desk | 21 Dec 2023 7:10 AM GMTPVR ఐనాక్స్ అసంబద్ధమైన, అన్యాయమైన వ్యాపార విధానాలపై సలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే గాక.. పీవీఆర్‌ని దక్షిణాదినా నిషేధిస్తున్నామని, పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్ స్క్రీన్లలో తమ సినిమా `సలార్`ని ఆడించబోమని ప్రకటించడం సంచలనమైంది. ఉత్తరాది, దక్షిణాది రెండు చోట్లా సలార్ ని పీవీఆర్ ప్రాపర్టీస్ లో, మిరాజ్ ప్రాపర్టీస్ లో ఆడించబోమని ప్రకటించడం నిజంగా వారికి ఊహించని షాక్.
ఈ సంచలన ప్రకటన అనంతరం PVR ఐనాక్స్ MD అజయ్ బిజిలీ డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నిస్తూ పెద్ద సినిమాల రిలీజ్ ల విషయంలో ఇలాంటి సమస్యలు రెగ్యులర్ గా చూసేవేనని, త్వరలోనే అన్ని పరిస్థితులు సర్ధుకుంటాయని వ్యాఖ్యానించారు. అయితే పీవీఆర్ అన్యాయం వెనక పీవీఆర్ ఎండి అజయ్ బిజిలీకి షారుఖ్ ఖాన్ పై ఉన్న అభిమానం, డంకీతో అతడికి ఉన్న సంబంధం కారణమని కొత్త విషయం వెలుగు చూసింది.
సంగీతం అంటే చెవి కోసుకునే అజయ్ బిజిలీ డంకీ కోసం ఒక పాట పాడారు. `వాహెగురు..` అంటూ సాగే పాట సినిమా థీమ్‌తో సందర్భోచితంగా వినిపిస్తుంది. ఐనాక్స్ ఎండి అజయ్ బిజిలీకి పాడేందుకు అవకాశం కల్పించారు షారూఖ్. అందువల్లనే ఇప్పుడు తమ సినిమా స్క్రీన్లలో ఖాన్ డంకీకి ఐనాక్స్ ఎండి బిజిలీ ప్రాధాన్యతనిచ్చారని కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది. ఫలితంగా నార్త్ సింగిల్ స్క్రీన్‌లలో సలార్ కంటే డుంకీకి ప్రాధాన్యత లభించిందని గుసగుస వినిపిస్తోంది. అయితే షారూఖ్ తో సత్సంబంధాలు, అలాగే అతడి సినిమాలో పాడే అవకాశం కోసం ఓవరాల్ గా తమ మల్టీప్లెక్స్ చెయిన్ వ్యాపారాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను అతడు తీసుకోగలడా? అనేది ఒక పెద్ద ప్రశ్న. వందల కోట్ల వ్యాపారాన్ని ప్రభావితం చేసే ఇలాంటి నిర్ణయం సరైనదేనా? అన్నది ఆలోచించదగినది. ఏదేమైనప్పటికీ బాలీవుడ్ అనే అనూహ్య ప్రపంచంలో కొన్ని సాధ్యమేనని గుసగుస వినిపిస్తోంది. అయతే ఇప్పటికి ఇది ప్రజల్లో పుట్టుకొచ్చిన ఊహాగానాలతో నిర్మితమైన సిద్ధాంతం. కేవలం ఊహాగానం మాత్రమే.
ఉత్తరాదిన ఎగ్జిబిటర్లు ప్రభాస్ సలార్ కంటే షారూఖ్ ఖాన్ డంకీకి మొగ్గు చూపడం వెనక పీవీఆర్ అధినేత ఉన్నారనేది సలార్ నిర్మాతల ఆందోళన కావచ్చు. అందుకే పీవీఆర్ ఐనాక్స్ ని దక్షిణాదినా నిషేధిస్తూ హోంబలే సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే షోల సంఖ్యపై నిర్ణయం ఎగ్జిబిటర్‌దేనని, మిరాజ్ గ్రూప్ సీఈఓ అమిత్ శర్మ అన్నారు. సలార్ నిర్మాతలు బాధపడ్డారని అతడు అయోమయంలో పడినట్టు తెలిసింది. ఎగ్జిబిటర్లు ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకుంటారని, వీక్షకుల ఎంపికపై వారికున్న పరిజ్ఞానం ఆధారంగా సినిమాలను ఎలా ఆడించాలో ఎవరికి కేటాయించాలో నిర్ణయించుకోవడానికి ఉత్తమమని భావిస్తారని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా PVR ఐనాక్స్ అవుట్‌లెట్‌లలో సలార్ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ నిరాకరిస్తున్నారనే వార్తలపై PVR పిక్చర్స్ CEO కమ్ జియాంచందానీ కూడా స్పందించారు. X లో ఆయన ఇలా రాసారు. సాధారణంగా మేం నిర్మాతలకు సంబంధించిన విషయాలను మాలో మేం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ ఇప్పుడు అభిప్రాయాన్ని చెప్పాల్సిందే. PVR-INOXలో అన్యాయమైన ప్రదర్శన పద్ధతులకు సంబంధించి మేం కొన్ని అసంబద్ధ ఇంటర్నెట్ పోస్ట్‌లను చూశాము. PVR-ఐనాక్స్ థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేస్తున్న నిర్మాతలందరి ప్రశంసలు గౌరవం ఇంకెవరికీ లేవు. పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదలవుతున్నందున వాణిజ్యపరమైన విభేధాలు సమానంగా ఉంటాయి. ఈ పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. చివరిసారి కాదు. త్వరలో ప్రతిదీ సెట్ రైట్ అవుతుంది. దయచేసి ఈ హాస్యాస్పదమైన సిద్ధాంతాలను మంచమెక్కించండి`` అని అన్నారు.
షారుఖ్ ఖాన్ డంకీ.. ప్రభాస్ సలార్ వరస రోజుల్లో విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు అసమానమైన హైప్ ఉంది. అయితే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ హవా డంకీతో పోలిస్తే ఎక్కువగా ఉందని కొన్ని హిందీ మీడియాల్లో కథనాలు రావడం, అటుపై ఉత్తరాది ఎగ్జిబిటర్లలో కొత్త పరిణామాలు షాకిచ్చాయి. పీవీఆర్- మిరాజ్ సినిమాస్ పై సలార్ నిర్మాతల బిగ్ పంచ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.