Begin typing your search above and press return to search.

షారుక్, హృతిక్ కాదు చరణ్​కు ఏ హీరో ఫ్యాషన్ ఇష్టమంటే

అభిమానులకే కాదు ఇతర బడా హీరోలు కూడా వీరి పేర్లే ఎక్కువగా చెబుతుంటారు. కానీ 'ఆర్​ఆర్​ఆర్'​తో వరల్డ్ వైడ్​గా బిగ్గెస్ట్​ హిట్ అందుకున్న మెగాపవర్​ స్టార్​ ఎవరూ ఊహించని పేరు చెప్పి సర్​ప్రైజ్​కు గురి చేశాడు.

By:  Tupaki Desk   |   30 July 2023 8:59 AM GMT
షారుక్, హృతిక్ కాదు చరణ్​కు ఏ హీరో ఫ్యాషన్ ఇష్టమంటే
X

సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హీరోల్లో 'ఫ్యాషన్ ఐకాన్' ఎవరు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు రణ్​వీర్ సింగ్​, షారుక్ ఖాన్​, హృతిక్ రోషన్​. అభిమానులకే కాదు ఇతర బడా హీరోలు కూడా వీరి పేర్లే ఎక్కువగా చెబుతుంటారు. కానీ 'ఆర్​ఆర్​ఆర్'​తో వరల్డ్ వైడ్​గా బిగ్గెస్ట్​ హిట్ అందుకున్న మెగాపవర్​ స్టార్​ ఎవరూ ఊహించని పేరు చెప్పి సర్​ప్రైజ్​కు గురి చేశాడు.

మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సైఫ్ అలీఖాన్ పేరు చెప్పారు. సైఫ్ అలీఖాన్​ స్టైల్​ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఆయన ఉండే విధానం బాగుంటుందని తెలిపారు. "ఓ రాజు కుటుంబంలో ఉండే ఠీవి, తేజస్సు, గంభీరం ఆయనలో కనపడుతుంది. ఆర్గానిక్​గా ఉంటారు. ఎక్కువగా ఫోకస్​​ అయ్యేందుకు ప్రయత్నించరు. నవాబీ పటౌడీ వంశం గుణాలు ఆయనలో స్పష్టంగా కనపడతాయి." అని చరణ్​ చెప్పారు.

అలాగే హీరోయిన్స్​ రణ్​వీర్​ సింగ్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె స్టైల్​ తనకు బాగా ఇష్టమని చెప్పారు. ఇంకా పలు విషయాలను తాజాగా తన్మయ్​ భత్​ చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇకపోతే సైఫ్​ అలీఖాన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ప్రస్తుతం తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్‌ అయ్యారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా అలరిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్‌'లో లంకేశ్‌గా కనిపించి మెప్పించారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న దేవర సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇక రామ్​చరణ్​.. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్​తో కలిసి 'గేమ్​ ఛేంజర్' అనే పొలిటికల్ థ్రిల్లర్​ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్ డ్రామాలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్​ నటించే అవకాశం ఉంది. అలాగే ఇందులో చరణ్​ దివ్యాంగుడిగా కనిపిస్తారని ఆ మధ్య ప్రచారం సాగింది.