Begin typing your search above and press return to search.

FEAR ఫస్ట్ లుక్: అందాల వేదిక భయంభయంగా..

కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తోంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 1:15 PM GMT
FEAR ఫస్ట్ లుక్: అందాల వేదిక భయంభయంగా..
X

విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వేదిక మొదట బాణం సినిమాతో మంచి నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆమె సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. "కాంచన 3" మరియు "రూలర్" వంటి చిత్రాలతో కూడా మంచి గుర్తింపు పొందిన వేదిక ఒక భాషకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే కన్నడలో కూడా ఛాన్సులు గట్టిగానే అందుకుంటోంది.


కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తోంది. రీసెంట్ గా ఓటీటీ ప్రపంచంలో కూడా బిజీగా మారిపోయింది. పలు వెబ్ సీరీస్ లు చేసిన అమ్మడు యక్షిని అనే ప్రాజెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు "ఫియర్" అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వంలో, దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు.

సహనిర్మాతలుగా సుజాతా రెడ్డి, సమా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో వేదిక ఒక చీకటి గదిలో భయపడుతున్నట్లు కనిపిస్తూ, సినిమా పై ఆసక్తిని పెంచుతోంది.

ఫస్ట్ లుక్ తోనే సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. "ఫియర్" చిత్రం ద్వారా ప్రేక్షకులకు కొత్త తరహా థ్రిల్లర్ అనుభవం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేదిక ఈ సినిమాలో చేయబోయే పాత్ర ఆమె కెరీర్‌లో ప్రత్యేకతగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అర్వింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 60కి పైగా అవార్డులను గెలుచుకోవడం విశేషం. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. "ఫియర్" సినిమాలో వేదిక పాత్ర ప్రేక్షకులకు కొత్తగా అనిపించే విధంగా రూపొందించారని మేకర్స్ తెలియజేస్తున్నారు.