పరీక్షలతో సంబంధం లేకుండా ఫిబ్రవరి లాక్!
దీంతో టైర్ -2 హీరోలు, యంగ్ హీరోలు కొందరు వాళ్ల మీద ఆధారపడి తమ సినిమా రిలీజ్ లు పెండింగ్ లో పెట్టడం కంటే సేప్ గా రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 6:52 AM GMTకొత్త ఏడాదిలో కొత్త సినిమాల రిలీజ్ అన్నది సంక్రాంతి సీజన్ తర్వాత మళ్లీ సమ్మర్ కే ఉంటాయి. వేసవి సెలవులు కలిసొస్తాయి అన్న కోణంలో ఎక్కువగా సమ్మర్ రిలీజ్ కే ఆసక్తి చూపిస్తుంటారు. విద్యార్ధులు సహా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్ కి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మాతలు అలా ప్లాన్ చేస్తుంటారు. అయితే గత వేసవి కి మాత్రం సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.
రిలీజ్ లు లేక థియేటర్లు బంద్ పెట్టాల్సి వచ్చింది. ఈ సంక్రాంతి కూడా ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అగ్ర హీరోల సినిమాలు కొన్ని రిలీజ్ కి ఉన్నాయి కానీ! అవి రిలీజ్ అవుతాయా? లేదా? అన్న సందిగ్గం ఉంది . దీంతో టైర్ -2 హీరోలు, యంగ్ హీరోలు కొందరు వాళ్ల మీద ఆధారపడి తమ సినిమా రిలీజ్ లు పెండింగ్ లో పెట్టడం కంటే సేప్ గా రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలని సైతం లాక్ చేస్తున్నారు.
వాస్తవానికి ఈ నెలలో రిలీజ్ లు ఉండవు. విద్యార్దుల పరీక్షల సీజన్. రూమ్ దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ప్రాక్టీకల్స్...రాత పరీక్షలు అంటూ టెన్షన్ తో గడిపే నెల ఇది. తల్లిదండ్రులు కూడా అదే బిజీలో ఉంటారు. కానీ 2025 ఫిబ్రవరి మాత్రం రిలీజ్ లతో హోరెత్తుతుంది. పిబ్రవరి 6 అజిత్ నటించిన `పట్టుదల` రిలీజ్ అవుతుంది. ఆ మరుసటి రోజు 7న నాగచైతన్య హీరోగా నటిస్తోన్న `తండేల్` భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈసినిమాపై అసాధారణమైన అంచనాలున్నాయి.
ఈ సినిమాతో చైతన్య పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమనే నమ్మకం అందరిలో ఉంది. అక్కడ నుంచి వారం రోజుల్లో ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యంగ్ హీరో విశ్వక్ సేన్ `లైలా`తో ప్రేక్షకుల ముందు కొస్తున్నాడు. అదే రోజున కిరణ్ అబ్బవరం `దిల్ రూబ`, బ్రహ్మానందం నటించిన `బ్రహ్మా ఆనందం` రిలీజ్ అవుతు న్నాయి. ఫిబ్రవరి 21న` మజాకా` రిలీజ్ అవుతుంది. అదే రోజున హాలీవుడ్ చిత్రం `రిటర్న్ ఆప్ ది డ్రాగన్` కూడా రిలీజ్ అవుతుంది. 28న `శబ్దం` అనే డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా ఫిబ్రవరి అంతా రిలీజ్ లు కనిపిస్తున్నాయి.